కాల్ సెంటర్ ముసుగులో అశ్లీల వీడియోలు చిత్రీకరణ, పోర్న్ సైట్స్ కు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Best Web Hosting Provider In India 2024

కాల్ సెంటర్ ముసుగులో అశ్లీల వీడియోలు చిత్రీకరణ, పోర్న్ సైట్స్ కు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

కాల్ సెంటర్ ముసుగులో…యువతీ యువకులతో బలవంతంగా అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని నిషేధిత అశ్లీల సైట్లకు విక్రయిస్తున్న ఓ ముఠాను ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు, డబ్బులు ఆశచూపి యువతీ యువకులను ప్రలోభపెట్టి అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తోంది ఈ గ్యాంగ్.

కాల్ సెంటర్ ముసుగులో అశ్లీల వీడియోలు చిత్రీకరణ, పోర్న్ సైట్స్ కు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

కాల్ సెంటర్ ముసుగులో అశ్లీల వీడియోలు రూపొందిస్తూ…వాటిని నిషేధిత అశ్లీల వెబ్ సైట్ లకు విక్రయిస్తున్న ముఠాను ఏపీ ఈగల్ టీమ్ పట్టుకుంటుంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ‘ఈగల్’ చీఫ్ రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరులో ఈగల్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లులో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతడు కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు. ఈ వీడియోలను నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు. వీడియోలను అమ్మి.. క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు పొందుతున్నాడు. లూయిస్ కు శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గణేష్, జోత్న్సలు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరణ

లూయిస్‌ కాల్‌ సెంటర్‌ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరించి, విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన అశ్లీల సైట్ నిర్వాహకులు ఇతడికి ఆన్‌లైన్‌ లో చెల్లింపులు చేస్తున్నారని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అందిన సమాచారంతో అధికారులు ఈ ముఠాపై నిఘాపెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా లూయిస్ రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అశ్లీల వీడియోలు విక్రయించి లూయిస్ పదకొండు లక్షల రూపాయల వరకూ సంపాదించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తామని యువతి యువకులను ప్రలోభపెట్టి వారితో పోర్న్ వీడియోలు రూపొదిస్తున్నాడు.

అశ్లీల సైట్ లలో యువతి యువకులతో లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందుకోసం గుంతకల్లులో ఏకంగా ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేసినట్లు ఐజీ ఆకే రవి కృష్ణ తెలిపారు. ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పి, యువతి యువకులతో పోర్న్ వీడియోలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఐజీ హెచ్చరించారు. సోషల్ మీడియా విచ్చలవిడితనం పేరడంతో…ఇలాంటి మోసాలు పెరిగాయని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవారు జాగ్రత్త

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఓటీపీ, పాస్ వర్డ్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారన్న విషయం కూడా చాలా కీలకమన్నారు. సోషల్ మీడియా పంచుకుంటున్న సమాచారమే సైబర్ కేటుగాళ్లకు ఆధారం అవుతుందన్నారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే డిజిటిల్ అరెస్ట్‌లను నమ్మవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Crime ApAndhra Pradesh NewsGuntur
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024