


Best Web Hosting Provider In India 2024

స్నాప్‌చాట్‌లో పరిచయమైన యువతిని డబ్బులు డిమాండ్, లేవన్నందుకు అశ్లీల చిత్రాలు ఇన్‌స్టాలో పోస్టు
స్నాప్ చాట్ లో యువతీ, యువకుడి మధ్య స్నేహం కుదిరింది. కొన్ని రోజులకు ఈ స్నేహం వీడియో కాల్స్ వరకూ వెళ్లింది. ఒకరి విషయాలు ఒకరు పంచుకున్నారు. ఇంతలో ఆ యువకుడు నిజస్వరూపం బయటపెట్టాడు. యువతి అశ్లీల చిత్రాలు రూపొందించి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో అశ్లీల చిత్రాలు సోషల్ మీడియా పోస్టు చేశాడు.
సామాజిక మాధ్యమం స్నాప్‌చాట్‌లో ఒక యువతికి యువకుడు పరిచయం అయ్యాడు. కొన్ని రోజులు బాగానే మాట్లాడుకున్నారు. వీడియో కాల్స్ కూడా చేసి మాట్లాడేవారు. అయితే ఉన్నట్టుండి ఆమెను అతడు డబ్బులు డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని యువతి చెప్పడంతో, ఆమె నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆలమూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి ఏడాది క్రితం సామాజిక మాధ్యమం స్నాప్‌చాట్‌లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం తటకనాపల్లికి చెందిన పడిపోవు హరీష్ (20) పరిచయం అయ్యారు. కొన్ని రోజులకు ఇద్దరూ స్నేహితులయ్యారు. దీంతో ఫోన్ నెంబర్ల ఇచ్చుకున్నారు.
ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గర అయ్యారు. వేర్వేరు జిల్లాలైనా ఫోన్‌లోనే నిరంతరం ఒకరి గురించి, మరొకరు తెలుసుకునేవారు. వారి వారి రోజువారీ కార్యకలపాలు పరస్పరం చెప్పుకునేవారు. కుటుంబ వివరాలు, వ్యక్తిగత అంశాలు ఇలా అన్ని ఇద్దరు మధ్య షేర్ చేసుకున్నారు. స్నేహం ముసుగులో హరీష్ యువతిని నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన ఆ యువతి అన్ని విషయాలు చెప్పేది. వీడియో కాల్స్ సైతం చేసుకున్నంత దగ్గర అయ్యారు.
అశ్లీల చిత్రాలు రూపొందించి
వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడేవారు. ఈ సమయంలో ఆమె అశ్లీల చిత్రాలను ఆన్‌లైన్ ద్వారా రూపొందించాడు. అలా కొంత కాలం వీడియో కాల్స్ బాగానే మాట్లాడిన అతడు, ఉన్నట్టుండి తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని ఆ యువతి ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఆమెపై హరీష్ ఒత్తిడి తెచ్చేవాడు. అయినప్పటికీ తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. దీంతో ఆమె పేరుతో మూడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఆయా అకౌంట్లలో ఆమె అశ్లీల చిత్రాలను పోస్టు చేశాడు.
దీంతో బాధితురాలు ఆలమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం ఆలమూరు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయమూర్తి 14 రోజుల జ్యూడిషయల్ రిమాండ్ విధించారు. ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ విద్యాసాగర్, ఎస్ఐ అశోక్ హెచ్చరించారు. అగంతకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్