Pooja Hegde: 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏం లాభం.. వాళ్లందరూ టికెట్లు కొనరు కదా: తెగ బాధపడుతున్న బ్యూటీ

Best Web Hosting Provider In India 2024

Pooja Hegde: 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏం లాభం.. వాళ్లందరూ టికెట్లు కొనరు కదా: తెగ బాధపడుతున్న బ్యూటీ

Hari Prasad S HT Telugu

Pooja Hegde: టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే సోషల్ మీడియా గురించి అసలు నిజం తెలుసుకున్నట్లుంది. కోట్ల కొద్దీ ఫాలోవర్లు ఉండటం వల్ల లాభమేంటి అని ఆమె ప్రశ్నిస్తోంది. ఆమె నటించిన రెట్రో మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

3 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏం లాభం.. వాళ్లందరూ టికెట్లు కొనరు కదా: తెగ బాధపడుతున్న బ్యూటీ

Pooja Hegde: ఒకప్పుడు తెలుగు సినిమాలను ఏలిన నటి పూజా హెగ్డే. ఆ తర్వాత అవకాశాలు లేక హిందీ, తమిళ సినిమాల వైపు వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. కానీ ఎంత ఫాలోయింగ్ ఉంటే మాత్రం ఏం లాభం అంటూ ఈ బ్యూటీ నిట్టూరుస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నదో చూడండి.

ఫాలోవర్లు టికెట్లు కావు కదా..

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ రెట్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె సోషల్ మీడియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు ప్రపంచం, సోషల్ మీడియా పూర్తిగా భిన్నమైనవని ఈ సంద్భంగా ఆమె అనడం గమనార్హం.

“నాకు ఇన్‌స్టాలో 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ అది నా సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల టికెట్లకు గ్యారెంటీ ఇవ్వదు కదా. అలాగే ఎంతో మంది సూపర్ స్టార్లకు 50 లక్షల మంది ఫాలోవర్లే ఉంటారు. కానీ వాళ్లు అంతకంటే ఎన్నో రెట్ల మందిని ఆకర్షించగలరు. అందుకే మన పని మనం సరిగ్గా చేసిన అవతలి వాళ్ల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి” అని పూజా హెగ్డే చెప్పింది.

సోషల్ మీడియా ప్రపంచం వేరు

సోషల్ మీడియా గురించి పూజా హెగ్డే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ప్రపంచం పూర్తిగా వేరని ఆమె అంటోంది. “సోషల్ మీడియా, నిజ ప్రపంచం రెండూ పూర్తిగా భిన్నమైనవి. నేను హైదరాబాద్, తిరుమల వెళ్లినప్పుడు అక్కడ అభిమానులను కలుస్తాను.

నా వరకు అది నాకు చాలా ముఖ్యం. సోషల్ మీడియాలో చాలా వరకు బాట్స్ ఉంటాయి. అందులో వాళ్ల ఫొటోలు ఉండవు. పోస్టులూ ఉండవు. ఈ ముఖాలు లేని పోస్టులు చూసి నేనూ ప్రభావితమవుతాను. ఎందుకంటే నేనూ మనిషినే. కానీ ఇది అసలు ప్రపంచం కాదన్న విషయం తెలుసుకోవాలి” అని పూజా చెప్పింది.

రెట్రో మూవీ గురించి..

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన మూవీ రెట్రో. ఇందులో ఫిమేల్ లీడ్ గా పూజా హెగ్డే నటించింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 1న రిలీజ్ కానుంది. లవ్ స్టోరీకి యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడించి తీసిన సినిమా ఇది. రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది. జ్యోతిక, సూర్య కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. కంగువ మూవీ డిజాస్టర్ నేపథ్యంలో ఈ రెట్రోపై సూర్య భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024