ఓటీటీల్లో ఈ వారం రెండు మలయాళ సినిమాలు.. యాక్షన్, కామెడీ జానర్ల చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఈ వారం రెండు మలయాళ సినిమాలు.. యాక్షన్, కామెడీ జానర్ల చిత్రాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Malayalam Movies: ఓటీటీల్లోకి ఈ వారం రెండు మలయాళ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఓ కామెడీ మూవీ ఎంట్రీ ఇచ్చింది. ఓ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.

ఓటీటీల్లో ఈ వారం రెండు మలయాళ సినిమాలు.. యాక్షన్, కామెడీ జానర్ల చిత్రాలు

ఓటీటీల్లో తాజాగా ఏ మలయాళ చిత్రాలు వస్తున్నాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలా వేచిచూసే వారికి కోసం ఈవారం రెండు మలయాళ సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇందులో ఒకటి యాక్షన్ మూవీ కాగా.. మరొకటి కామెడీ డ్రామా జానర్లో ఉంది. ఈ రెండు చిత్రాలను ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

దావీద్

ఆంటోనీ వర్గీస్ హీరోగా దావీద్ సినిమా వచ్చింది. ఈ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. బాక్సింగ్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి గోవింద్ విష్ణు దర్శత్వం వహించారు. దావీద్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

దావీద్ సినిమాలో వర్గీస్‍కు జోడీగా లిజోమోల్ జోస్ నటించారు. మో ఇస్మాయిల్, విజయరాఘవన్, సైజు కురుప్, రమేశ్, కుచ్చు తెలుస్ కీలకపాత్రలు చేశారు. సెంచరీ మ్యాక్స్ & జాన్ మేరి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు.

దావీద్ స్టోరీలైన్: ఆషిక్ అబూ (ఆంటోనీ వర్గీస్) ఖాళీగా ఉంటూ భార్య షెరీన్ (లిజోమోల్ జోస్) సంపాదనపై ఆధారపడతాడు. ఈ క్రమంలో బౌన్సర్‌గా పనిలో చేరతాడు. కేవలం సెలెబ్రిటీలకే బౌన్సర్‌గా వెళుతుంటాడు. ఈ క్రమంలో టర్కిష్ బాక్సర్ సైనుల్ అఖ్మదోవ్ (మో ఇస్మాయిల్‍)కు సెక్యూరిటీగా ఓ బాక్సింగ్ ఈవెంట్‍కు ఆషిక్ వెళతాడు. అక్కడ అనుకోని కొన్ని ఘటనలు జరుగుతాయి.

ఈ క్రమంలో తాను సెక్యూరిటీగా వచ్చిన బాక్సర్ సైనుల్‍‍తోనే పోటీ పడి నాకౌట్ చేస్తాడు ఆషిక్. అతడిని అఖ్మదోవ్ ఛాలెంజ్ చేస్తాడు. దీంతో కోచింగ్ తీసుకొని బాక్సర్ కావాలని ఆషిక్ డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అఖ్మదోవ్‍తో ఆషిక్ మళ్లీ పోటీ పడ్డాడా? అతడి గతమేంటి? అనే అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. దావీద్ సినిమాను ఏప్రిల్ 18 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.

దాసెట్టంటె సైకిల్

మలయాళ కామెడీ డ్రామా మూవీ దాసెట్టంటె సైకిల్ ఈ ఆదివారమే ఏప్రిల్ 13న మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సినిమాలో హరీశ్ పేరడి లీడ్ రోల్ చేశారు. అంజనా అప్పుకుట్టన్, కబని, సుకుమారన్ కీరోల్స్ చేశారు.

దాసెట్టంటె సైకిల్ చిత్రానికి అఖిల్ కవుంగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్చి 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సైకిల్ వల్ల వాచ్‍మెన్‍గా పని చేసే వ్యక్తి జీవితంలో ఎదురైన పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. సామాజిక అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీని చూసేయవచ్చు.

కాగా, బ్యాడ్ బ్యాయ్స్ అనే మలయాళ చిత్రం కూడా రీసెంట్‍గానే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్.. రెండు ఓటీటీల్లో అడుగుపెట్టింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ యాక్షన్ కామెడీ మూవీ థియేటర్లలో విడుదలైంది. సుమారు ఆరు నెలలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. రహమాన్, బాబూ ఆంటోనీ లీడ్ రోల్స్ చేసిన బ్యాడ్ బాయ్స్ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024