




Best Web Hosting Provider In India 2024

Sarangapani Jathakam Trailer: అన్నీ నువ్వే చేసుకోవడానికి ఇదేమీ అది కాదు.. బోల్డ్ డైలాగ్, బోలెడన్ని నవ్వుల ట్రైలర్
Sarangapani Jathakam Trailer: సారంగపాణి జాతకం ట్రైలర్ వచ్చేసింది. ఓ బోల్డ్ డైలాగుతోపాటు బోలెడన్ని నవ్వులు పంచుతూ వచ్చిన ఈ మూవీ ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. మరో వారంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూడండి.
Sarangapani Jathakam Trailer: ప్రియదర్శి లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ సారంగపాణి జాతకం. ఓ వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ కామెడీ డ్రామా నుంచి బుధవారం (ఏప్రిల్ 16) ట్రైలర్ రిలీజైంది. కేవలం నవ్వులు పూయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ ట్రైలర్ ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
సారంగపాణి జాతకం ట్రైలర్
సారంగపాణి జాతకం.. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ బోల్డ్ డైలాగుతోపాటు ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా సాగింది. ప్రియదర్శి, వెన్నెల కిశోర్, హర్ష త్రయం పోటీ పడి మరీ నవ్వించడానికి ప్రయత్నించారు. మూవీలో ఫిమేల్ లీడ్ గా రూపా కొడువాయూర్ నటించింది.
ఈ ట్రైలర్ ఓ హత్య చేసినట్లుగా కలగనే సారంగపాణి (ప్రియదర్శి) ఉలిక్కి పడి లేవడంతో ప్రారంభమవుతుంది. ఇక ఆ తర్వాత మొత్తం నవ్వులే నవ్వులు. అతనిది గోల్డెన్ హ్యాండ్ అని, జీవితమంతా హ్యాపీగా సాగిపోతుందని అతని చేయి చూసిన జ్యోతిష్యుడు చెబుతాడు.
తర్వాత ట్రైలర్ సారంగపాణి లవ్ స్టోరీ వైపు మళ్లుతుంది. పెళ్లికి రెడీ అయిన అతడు.. అమ్మాయి గురించి కొన్ని సీక్రెట్స్ తెలిసే సరికి వాయిదా వేస్తాడు. ఆ తర్వాత అతడు పెళ్లికి రెడీ అయినా.. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి వాయిదా పడుతుంది. ఆ పెళ్లి కోసం సారంగపాణి ఏం చేశాడన్నది మూవీలో చూడొచ్చు.
సారంగపాణి జాతకం మూవీ గురించి..
సారంగపాణి జాతకం మూవీని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో అష్టాచెమ్మ, జెంటిల్మెన్, సమ్మోహనంలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన అతడు.. ఈసారి ఈ సారంగపాణి జీవితం మూవీతో ఓ పూర్తి నవ్వుల రైడ్ ను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమయ్యాడు.
ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మొత్తం తెలుగు మాట్లాడే నటీనటులే నటించినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియదర్శితోపాటు వెన్నెల కిశోర్, హర్ష చెముడు, నరేష్, అవసరాల శ్రీనివాస్, రాజా చెంబోలు, తనికెళ్ల భరణిలాంటి వాళ్లు నటించారు. సారంగపాణి జాతకం మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.