




Best Web Hosting Provider In India 2024
లవర్‌తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..
లవర్‌తో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళను, ఆమె భర్త చూశాడు. వారి అసభ్యకర స్థితి చూసి గొడవపడ్డాడు. కోపంతో వారిద్దరు అతడిని చంపేశారు. హరియాణాలో జరిగింది ఈ ఘటన.
హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ- లవర్‌తో కలిసి తన భర్తను చంపేసింది. వారిద్దరిని అతను ఏకాంతంగా, అసభ్యకర స్థితితో చూసి, గొడవ పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
అసలేం జరిగిందంటే..
హరియాణా హిసార్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల రవీనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఇష్టం. ఇతర క్రియేటర్లతో కలిసి ఆమె డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.
కాగా 32ఏళ్ల రవీనకు సురేష్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేశారు.
వాస్తవానికి రవీన భర్త ప్రవీణ్, అతని కుటుంబసభ్యులకు సురేష్ అంటే ఇష్టం లేదు. అతడికి దూరంగా ఉండాలని చెప్పేవారు. కానీ రవీన మాత్రం సురేష్‌తో డ్యాన్స్‌లు చేసి, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఆపలేదు.
వీడియోలు అప్లోడ్ చేయడం ఆమెకు వ్యసనంగా మారింది. భర్తతో గొడవలు జరుగుతున్నా ఆమె పట్టించుకోలేదు. కాగా గత నెల 25న.. రవీన- సురేష్‌లు ఒంటరిగా, అసభ్యకర స్థితిలో ఉండటాన్ని ప్రవీణ్ చూశాడు. ముగ్గురి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా తీవ్రమైంది. చివరికి.. రవీన తన దుపట్టాను ప్రవీణ్ గొంతుకు చుట్టింది. సురేష్ సాయంతో భర్త గొంతు నులిమి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది.
అర్థరాత్రి బండి మీద..
భర్తను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని రవీన దాచిపెట్టింది. ప్రవీణ్ ఎక్కడ? అని అడిగినప్పుడు తనకేమీ తెలియదన్నట్టు ప్రవర్తించింది. ఆ రోజ అర్థరాత్రి.. సురేష్ బండి మీద వచ్చాడు. రవీన- సురేష్‌లు కలిసి ప్రవీణ్ మృతదేహాన్ని బండి మీద ఎక్కించుకుని 6 కిలోమీటర్లు ప్రయాణించి దిన్నోడ్ రోడ్ నాలాలో పడేశారు.
మార్చ్ 28న కుళ్లిపోయిన ఓ మృతదేహం బయటకు వచ్చింది. అది ఎవరిది? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు సదర్ పోలీస్ స్టేషన్ అధికారులు. ఆ మృతదేహం ప్రవీణ్‌దే అని, అతను కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడని తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా రవీన, సురేష్‌లు దొరికిపోయారు. అర్థరాత్రి హెల్మెట్ వేసుకున్న ఓ వ్యక్తి, ఓ మహిళ మధ్యలో మరొకరు ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. రెండు గంటల తర్వాత రవీన, ఏమీ జరగనట్టు అదే బండి మీద ఇంటికి తిరిగివెళ్లిపోయిన దృశ్యాలు సైతం సీసీటీవీలో కనిపించాయి.
రవీన- సురేష్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తమ గురించి తెలిసిపోయి, ప్రవీణ్ గొడవపెట్టుకోవడంతో అతడిని చంపేసినట్టు రవీన తెలిపింది.
రవీన- సురేష్లను పోలీసులు జైలుకు తరలించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో రవీన- ప్రవీణ్ 6ఏళ్ల కుమారుడు ఇప్పుడు అతని తాత, మామ దగ్గర జీవిస్తున్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source link