Jr NTR: సన్నబడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంజెక్షన్లు తీసుకున్నారా? అసలు నిజం ఇదే..

Best Web Hosting Provider In India 2024

Jr NTR: సన్నబడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంజెక్షన్లు తీసుకున్నారా? అసలు నిజం ఇదే..

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ సడెన్‍గా చాలా సన్నగా అవుతుండటంతో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఒజెంపిక్ ఇంజెక్షన్ వాడుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై వాస్తవం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

Jr NTR: సన్నబడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంజెక్షన్లు తీసుకున్నారా? అసలు నిజం ఇదే..

స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కొంతకాలంగా బాగా సన్నబడుతున్నారు. బరువు తగ్గిపోతున్నారు. తాజాగా ఆయన దిగిన ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుపు కంటే ఆయన చాలా సన్నగా కనిపిస్తున్నారు. దీంతో ఏమైందంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రకరకాల రూమర్లు వస్తున్నాయి.

ఒజెంపిక్ వాడుతున్నారంటూ రూమర్లు

ఓ హోటల్ సిబ్బందితో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్‍గా ఎన్టీఆర్ అంత సన్నగా ఎలా అయ్యారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బరువు తగ్గేందుకు ఒజెంపిక్‍ అనే ఇంజెక్షన్లను ఎన్టీఆర్ తీసుకుంటున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవం ఇదే

ఎన్టీఆర్ కొత్త లైఫ్‍స్టైల్ ఫాలో అవుతూ బరువు తగ్గుతున్నారని, ఒజెంపిక్ వాడడం లేదని విశ్వసనీయ వర్గాల నుంచి హెచ్‍టీకి సమాచారం తెలిసింది. ఎన్టీఆర్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారని వెల్లడైంది.

ప్రశాంత్ నీల్ చిత్రం కోసం ఎన్టీఆర్ లుక్ మారుస్తున్నారని, అందుకోసం డైట్‍లో మార్పులు చేసుకున్నారని సమాచారం అందింది. “ఆయన చాలా బాగున్నారు. కొత్త డైట్ ఫాలో అవుతున్నారు. ప్రశాంత్ నీల్‍తో సినిమాకు లుక్ కోసం ఫిబ్రవరి నుంచి కొత్త ఫిట్‍నెస్ పద్దతులు పాటిస్తున్నారు. ఈ మార్పులు దాని ఫలితమే” అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి హోటల్ స్టాఫ్‍తో ఎన్టీఆర్ కలిసి దిగిన ఫొటోలను చాలా మంది నెటిజన్లు.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తున్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా.. ఎందుకు అంత బక్కగా అవుతున్నారని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఒజెంపిక్ వాడుతున్నారంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. అయితే, ఒజెంపిక్ లాంటివి ఎన్టీఆర్ వాడడం లేదని, లైఫ్‍స్టైల్ ఛేంజ్ చేసుకొని బరువు తగ్గుతున్నారని సమాచారం బయటికి వచ్చింది. మరి ఈ రూమర్లకు ఇప్పటికైనా ఆగుతాయేమో చూడాలి.

వచ్చే వారం షూటింగ్‍కు ఎన్టీఆర్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో తదుపరి సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలుకాగా.. ఎన్టీఆర్ లేని కొన్ని సీన్ల చిత్రీకరణ జరిగింది. ఇక, వచ్చే వారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ చిత్రం షూటింగ్‍లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్ అంతలా సన్నబడ్డారు. హైవోల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన నీల్ మూవీలో.. ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ అధికంగా ఉంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు రూమర్లు ఉన్నాయి.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024