OTT Horror Movie: ఓటీటీలో తమిళ హారర్ మూవీ తెలుగు వెర్షన్ దూకుడు.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్

Best Web Hosting Provider In India 2024

OTT Horror Movie: ఓటీటీలో తమిళ హారర్ మూవీ తెలుగు వెర్షన్ దూకుడు.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్

Hari Prasad S HT Telugu

OTT Horror Movie: ఓటీటీలో ఇప్పుడో తమిళ హారర్ మూవీ దూకుడుగా వెళ్తోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకొని ఆశ్చర్యపరుస్తోంది.

ఓటీటీలో తమిళ హారర్ మూవీ దూకుడు.. మూడు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్

OTT Horror Movie: హారర్ జానర్ సినిమాలకు ఓటీటీలో ఎంత డిమాండ్ ఉంటుందో తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ నిరూపిస్తోంది. ఈ సినిమా గత ఆదివారం (ఏప్రిల్ 13) జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

కింగ్‌స్టన్ ఓటీటీ స్ట్రీమింగ్

మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మూవీ కింగ్‌స్టన్. ఈ సినిమా గత నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తెలుగులోనూ రిలీజైన ఈ హారర్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయితే ఇప్పుడు జీ5 ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది.

తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ల (5 కోట్ల) స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షనే ఇప్పుడీ 50 మిలియన్ల (5 కోట్ల) స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ దాటడం విశేషం.

ఈ విషయాన్ని బుధవారం (ఏప్రిల్ 16) జీ5 ఓటీటీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. “50 మిలియన్ల (5 కోట్ల) స్ట్రీమింగ్ మినట్స్. మనసును కదిలించే మిస్టరీ, న్యూ ఏజ్ హారర్ తో ఈ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. మస్ట్ వాచ్ కింగ్‌స్టన్ మూవీని జీ5లో మిస్ కాకుండా చూడండి” అని ఆ ఓటీటీ చెప్పింది.

కింగ్‌స్టన్ మూవీ స్టోరీ ఏంటంటే?

సముద్రం బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ ఈ కింగ్‌స్టన్. హార‌ర్‌, జాంబీ, ల‌వ్‌స్టోరీ, యాక్ష‌న్ ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు క‌మ‌ల్ ప్ర‌కాష్ కింగ్‌స్ట‌న్ మూవీని తెర‌కెక్కించాడు. కింగ్‌స్ట‌న్ పాయింట్‌ను ద‌ర్శ‌కుడు ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు. ఓ ఊరిని వెంటాడుతోన్న ఆత్మ శాపం.. ఆ మిస్ట‌రీని ఛేదించ‌డానికి స‌ముద్రంపైకి వెళ్లిన హీరో..ఈ పాయింట్‌తో రెండున్న‌ర గంట‌లు ఆడియెన్స్‌కు థ్రిల్ ను పంచాడు.

జీవీ ప్ర‌కాష్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద ప్ల‌స్స‌యింది. రా అండ్ ర‌స్టిక్ రోల్‌కు న్యాయం చేశాడు. అత‌డి లుక్‌, గెట‌ప్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా కుదిరాయి. న‌టుడిగా జీవీ ప్ర‌కాష్‌లోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్క‌రించింది. ఇక హీరోయిన్ దివ్య‌భార‌తి పాత్ర‌ను కేవ‌లం ల‌వ్‌స్టోరీ కోస‌మే పెట్టిన‌ట్లుగా అనిపించింది. జీవీ ప్ర‌కాష్‌తో ఆమె కెమిస్ట్రీ కొన్ని చోట్ల ప‌ర్వాలేద‌నిపిస్తుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024