RP Patnaik: ఈ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

RP Patnaik: ఈ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

RP Patnaik About Madhuram Movie And His Flashback: లవ్ స్టోరీ చూడగానే తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చిందని సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఇటీవల జరిగిన మధురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే, వీవీ వినాయక్ మధురం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది.. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కామెంట్స్

RP Patnaik About Madhuram Movie And His Flashback: యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించి టీనేజ్ లవ్ స్టోరీ సినిమా మధురం. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. నిర్మాత యం. బంగార్రాజు నిర్మించిన మధురం సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.

మధురం ట్రైలర్ రిలీజ్

ఈ నేపథ్యంలో తాజాగా టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మధురం ట్రైలర్‌‌ను సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి, మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్” అని చెప్పారు.

వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

అలాగే, ఈ సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 15) సాయంత్రం వైభవంగా మధురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆర్పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

పదేళ్ల తర్వాత రావాల్సిన మూవీ

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. “మధురం ట్రైలర్ చాలా బాగుంది. టీనేజ్ లవ్ స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది. 2008లో నేను ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా ‘అందమైన మనసులో’. అది పదమూడేళ్ల అమ్మాయి లవ్ స్టోరీ. ఆ టైమ్‌లో సినిమా చూసినవాళ్లంతా పదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అన్నారు. అలాంటి కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది

“ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ, ట్రైలర్ చూశాక ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తే బంగార్రాజు లాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వస్తారు. టీమ్ అందరికీ గుడ్ లక్” అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.

90స్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలన్నీ

రఘుకుంచె మాట్లాడుతూ.. “ఈ చిత్రంలోని పాటలన్నీ మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. 90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.

ఫస్ట్ లవ్ స్టోరీకి ప్రత్యేకత

“ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉదయ్ రాజ్ హీరోగా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలి. తనతోపాటు టీమ్ అందరికీ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా” అని రఘు కుంచె ఆకాంక్షించారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024