యూజీసీ నెట్​ జూన్​ 2025 అప్లికేషన్​కి చివరి తేదీ ఏది? పరీక్ష ఎప్పుడు?

Best Web Hosting Provider In India 2024


యూజీసీ నెట్​ జూన్​ 2025 అప్లికేషన్​కి చివరి తేదీ ఏది? పరీక్ష ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

యూజీసీ నెట్ జూన్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షకు సంబంధించిన కీలక తేదీలు, పరీక్ష సరళి తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

యూజీసీ నెట్ జూన్ 2025

యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్​ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ పోస్టులకు, ‘జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్’ అవార్డుకు భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి యుజిసి నెట్ పరీక్షను నిర్వహిస్తారు.

పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించే ఎన్టీఏ బులెటిన్​ని జాగ్రత్తగా చదవాలి. యూజీసీ నెట్ జూన్ 2025కు అభ్యర్థులు ఆన్​లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్​ మరే ఇతర మోడ్​లోనూ ఆమోదించరు.

యూజీసీ నెట్​ 2025 నోటిఫికేషన్​- కీలక తేదీలు

దరఖాస్తు విండో: 16 ఏప్రిల్ 2025 నుంచి 7 మే 2025 (రాత్రి 11:59 గంటల వరకు)

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 8 మే 2025 (రాత్రి 11:59 గంటల వరకు)

కరెక్షన్ విండో: 9 మే నుంచి 10 మే 2025

అడ్మిట్ కార్డు విడుదల: అధికారిక ఎన్టీఏ వెబ్​సైట్​లో ప్రకటించాల్సి ఉంది.

పరీక్ష తేదీలు: 21 జూన్ 2025 నుంచి 30 జూన్ 2025 వరకు.

ఫలితాల ప్రకటన: natboard.edu.in లో తేదీ వెల్లడించాల్సి ఉంది.

యూజీసీ నెట్ జూన్ 2025 రెండు పేపర్లతో కూడిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఫార్మాట్​లో నిర్వహిస్తారు.

పేపర్ 1: టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, జనరల్ అవేర్​నెస్​.

పేపర్-2: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా సబ్జెక్టు స్పెసిఫిక్ పేపర్.

రెండు పేపర్లలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూలు) ఉంటాయని, వాటి మధ్య విరామం లేకుండా నిర్వహిస్తామన్నారు.

అర్హత

యూజీసీ నెట్​ 2025 అభ్యర్థులు మాస్టర్స్ డిగ్రీ లేదా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు / సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55% మార్కులు (రిజర్వ్డ్ కేటగిరీలకు 50%) సాధించి ఉండాలి.

వయోపరిమితి:

జేఆర్​ఎఫ్​ : 2025 జూన్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్: గరిష్ట వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక ఎన్టీఏ వెబ్సైట్: https://ugcnet.nta.ac.in ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో రిజిస్ట్రేషన్, వ్యక్తిగత, అకాడమిక్ వివరాలను నింపడం, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం, పరీక్ష ఫీజు చెల్లించడం ఉంటాయి.

పరీక్ష ఫీజు

జనరల్ /అన్ రిజర్వ్ డ్ : రూ.1,150

జనరల్ -ఈడబ్ల్యూఎస్ /ఓబీసీ-ఎన్ సీఎల్ : రూ.600

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ : రూ.325

సబ్జెక్టులు, పరీక్షా కేంద్రాలు..

యూజీసీ నెట్ జూన్ 2025లో వివిధ రకాల సబ్జెక్టులు ఉంటాయి. అధికారిక బులెటిన్​లో సబ్జెక్టుల వివరాలతో పాటు వాటి కోడ్​లను పొందుపరిచారు. ఈ పరీక్షను భారతదేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. ఇది అభ్యర్థులు తమకు నచ్చిన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తుంది.

ముఖ్యమైన సూచనలు..

అప్లికేషన్ ఫామ్​లో ఇచ్చిన మొత్తం సమాచారం ఖచ్చితమైనది, సంపూర్ణమైనదిగా ధృవీకరించుకోండి.

భవిష్యత్తు రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ పేజీ, చెల్లింపు రసీదు కాపీని ప్రింటౌట్​ తీసుకోండి.

పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ కోసం అధికారిక ఎన్టీఏ వెబ్​సైట్​ని క్రమం తప్పకుండా చూడండి.

పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/images/information-bulletin-for-ugc-net-june-2025-16042025.pdf లో ఉన్న అధికారిక ఇన్ఫర్మేషన్ బులెటిన్​ని చూడాలి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link