



Best Web Hosting Provider In India 2024
రాజీవ్ యువ వికాసం స్కీమ్ – మీ అప్లికేషన్ వివరాలను ఇలా చెక్ చేసుకోండి
రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తైయింది. 15 లక్షలకుపైగా అప్లికేషన్లు అందాయి. అయితే దరఖాస్తుదారుడి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షలకుపైగా అప్లికేషన్లు అందాయి. అర్హతలకు తగ్గటుగా… అందుబాటులో ఉన్న యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు.
రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి అధికారులు కొత్త అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తుదారులు వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ఆప్షన్ తీసుకువచ్చారు. ఇక్కడ దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి… వివరాలను తెలుసుకోవచ్చు.
రాజీవ్ యువ వికాసం – మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి
- రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ముందుగా కార్పొరేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే దరఖాస్తుదారుడి వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి ఈ కాపీని పొందవచ్చు.
ఏప్రిల్ 14వ తేదీతో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నారు. మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి.
పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా డీఆర్‌డీఏ పీడీ ఉంటారు. ఈ కమిటీలు జిల్లాల వారీగా అర్హుల జాబితాలను ఫైనల్ చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు.
ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి… పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుదారుడి వివరాలను పొందవచ్చు….
సంబంధిత కథనం
టాపిక్