




Best Web Hosting Provider In India 2024

జుట్టు డ్యామేజ్ అయిందని బాధపడుతున్నారా..? వంటగదిలో దొరికే ఈ వస్తువులతో పరిష్కారం పొందండి!
పాడైపోయిన మీ జుట్టును బాగుచేసుకోవాలంటే ఖరీదైన ట్రీట్మెంట్లు అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సహజమైన, ఆరోగ్యకరమైన జుట్టును తిరిగి పొందవచ్చు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగించే ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోయి ఎదుగుదల ఆగిపోవడం, పీలగా, నిర్జీవంగా కనిపించడం వీటిలో ఏ ఒక్క సమస్యైనా మీకు ఉండే ఉండచ్చు. దీనికి మీరు రకరకాల క్రీములు, రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడి ఉండచ్చు. నిజానికి అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాలతో కూడిన ఉత్పత్తులు, రంగులను ఉపయోగించడం వల్ల ఈ రోజుల్లో సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి. ఇవి మృదువైన మీ జుట్టును దెబ్బతీసి బరకగా, బలహీనంగా మారుస్తాయి.
మీ జుట్టు ఇలా అయిపోయిందని బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సెలూన్లకు, డాక్టర్లు చుట్టూ తిరగాల్సిన అవసర్లేదు. కేవలం ఇంటి రెమెడీలతో అది కూడా వంటగదిలో దొరికే సాధారణమైన సామాన్లతో పరిష్కారం పొందొచ్చు. అదెలా అంటారా.. రండి చూసేద్దాం.
సున్నితమైన, మృదువైన జుట్టు కోసం
గుడ్లతో పాటు ఆవకాడోల నుండి తేనె, కొబ్బరి నూనె వరకు అందుబాటులో ఉండే సహజ పదార్థాలు దెబ్బతిన్న జుట్టును బాగు చేస్తాయి. అవసరమైన మేర ప్రొటీన్లు, విటమిన్, కొవ్వు ఆమ్లాలతో నిండి ఉండి ఆరోగ్యకరంగా మారుస్తాయి. ఈ DIY నివారణలు బడ్జెట్‌కు అనుకూలంగా ఉండటమే కాకుండా, కఠినమైన రసాయనాలకు దూరంగా ఉంచి హాని కలగకుండా కాపాడతాయి. ఇవి మీ కేశాలను సున్నితంగానూ, మృదువుగానూ మారుస్తాయి.
వంటగదిలో సామాన్లతో పరిష్కారం పొందడమెలా:
1. గుడ్డు మాస్క్:
పొడిగా, కెమికల్ వల్ల దెబ్బతిన్న జుట్టు ఉన్నవారికి ఈ మాస్క్ ఉపయోగకరం. గుడ్లు ప్రొటీన్, లెసిథిన్‌తో నిండి ఉంటాయి. ఇవి జుట్టును బలపరచి తేమను అందిస్తాయి.
ఎలా వాడాలంటే:
- ఒకటి లేదా రెండు గుడ్లను కొట్టి బాగా కలపండి.
- అందులో ఒక స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలపండి.
- ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు అప్లై చేయండి.
- షవర్ క్యాప్ పెట్టుకొని 20–30 నిమిషాలు ఉంచండి.
- ఆ తర్వాత చల్లటి నీటితో తుడిచి, సాధారణంగా షాంపూలో స్నానం చేసేయండి.
2. అవకాడో + తేనె మాస్క్:
పొడిగా, జీవం లేని జుట్టుకు చక్కటి పరిష్కారమిది. ఆవకాడోలో విటమిన్లు, మంచి కొవ్వులు ఉంటాయి. వాటితో పాటుగా తేనె వాడటం వల్ల జుట్టులో తేమను నింపుతుంది.
ఎలా వాడాలంటే:
- సగం ఆవకాడోను బాగా మెత్తని గుజ్జులా చేయండి.
- అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నూనె లేదా పెరుగు వేసి బాగా కలపండి.
- జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు ఉంచండి.
- ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి.
3. అరటి + కొబ్బరి నూనె మాస్క్:
జెర్లుగా మారిన జుట్టు ఉన్నవారికి ఈ మాస్క్ చాలా ఉపయోగకరం. అరటిపండు జుట్టును సాఫ్ట్‌గా చేస్తుంది. కొబ్బరి నూనె జుట్టు లోపలి వరకూ తేమను పంపిస్తుంది.
ఎలా వాడాలంటే:
- ఒక బాగా పండిన అరటిపండును తీసుకుని దానిని మెత్తగా మెదుపుకోండి.
- ఇప్పుడు ఆ గుజ్జులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి కలపండి.
- ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి 20–30 నిమిషాలు ఉంచండి.
- ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగండి.
4. ఆపిల్ సిడర్ వెనిగర్ రిన్స్:
జుట్టు మసకగా మారిన వారికీ, స్కాల్ప్ బిల్డప్ ఉన్నవారికీ జుట్టును మెరిపించడంతో పాటు, వెంట్రుకలలో పేరుకుపోయిన మైనం వంటి మలినాలను తీసేస్తుంది. pH బ్యాలెన్స్‌ను కాపాడుతుంది.
ఎలా వాడాలంటే:
- రెండు స్పూన్లు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక కప్పు నీటిలో కలపండి.
- షాంపూ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మీద పోయండి.
- కొన్ని నిమిషాల పాటు ఉంచి, చల్లటి నీటితో కడిగేయండి.
5. కొబ్బరి నూనె ఓవర్‌నైట్ ట్రీట్మెంట్:
ఎక్కువసార్లు తడపడం వల్లనో, కలర్ చేస్తేనో జుట్టు బలహీనంగా మారిపోతుంది. అటువంటి జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెను అప్లై చేసుకోవడం వల్ల ప్రొటీన్ నష్టం తగ్గిస్తుంది.
ఎలా వాడాలంటే:
- కొద్దిగా కొబ్బరి నూనెను వెచ్చగా చేసి తలకు రాయండి.
- జుట్టు ముగింపు భాగాలపై ఎక్కువగా అప్లై చేయండి.
- జుట్టును బ్రెయిడ్ చేసుకుని స్కార్ఫ్ లేదా షవర్ క్యాప్ పెట్టండి.
- రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే శుభ్రంగా షాంపూ చేయండి.
ఈ మాస్క్‌లను సమస్యను బట్టి ఎంచుకుని వారానికి 1–2 సార్లు వాడండి. కానీ, ఫలితాల కోసం కొంత సమయం పడుతుంది. వాటితో పాటుగా ఎక్కువగా నీరు తాగండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తరచుగా జుట్టును కత్తిరించడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి.
సంబంధిత కథనం