Sukumar: సుకుమార్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మూవీస్‌ ఇవే – అన్ని కామెడీ సినిమాలే

Best Web Hosting Provider In India 2024

Sukumar: సుకుమార్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మూవీస్‌ ఇవే – అన్ని కామెడీ సినిమాలే

Nelki Naresh HT Telugu

Sukumar: ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ముందు సుకుమార్ నాలుగు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ సినిమాల‌న్నీ కామెడీ ప్ర‌ధానంగానే తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీస్ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే?

సుకుమార్

పుష్ప‌2 మూవీ\అల్లు అర్జున్‌తో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1800 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూడో మూవీగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది.

కామెడీ సినిమాలు…

కాగా ద‌ర్శ‌కుడిగా కెరీర్ ఆరంభం నుంచి ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ క్రియేటివ్ జీనియ‌స్‌గా పేరు తెచ్చుకున్నాడు. ల‌వ్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్…అన్ని జాన‌ర్స్‌లో సినిమాలు చేశారు. కానీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మాత్రం సుకుమార్ కామెడీ సినిమాలు ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం.

క్షేమంగా వెళ్లి లాభంగా రండి…

సినిమాల‌పై ఆస‌క్తితో లెక్చ‌ర‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుకుమార్‌…రైట‌ర్ ఆకుల శివ ద్వారా స‌హాయ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన హ‌నుమాన్ జంక్ష‌న్‌, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మ‌న‌సిచ్చి చూడు సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

ఈ మూవీ సినిమాలు కామెడీ ప్ర‌ధానంగానే రూపొంద‌డం గ‌మ‌నార్హం. ఈ మూడు సినిమాలు క‌మ‌ర్షియ‌ట్‌గా విజ‌యాల‌ను సాధించాయి.

15 వంద‌ల రెమ్యున‌రేష‌న్‌..,

నెల‌కు ప‌దిహేను వంద‌ల రెమ్యున‌రేష‌న్‌తోనే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా సుకుమార్ ప‌నిచేశారు. హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాకు వీవీ వినాయ‌క్ త‌మ్ముడు విజ‌య్ కెమెరా అసిస్టెంట్‌గా ప‌నిచేశారు. విజ‌య్ ద్వారా వినాయ‌క్‌తో సుకుమార్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆ టైమ్‌లో వినాయ‌క్ దిల్ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. దిల్ సినిమాకు వినాయ‌క్ అసిస్టెంట్‌గా సుకుమార్ చేరిపోయాడు. ఆ నిర్ణ‌య‌మే సుకుమార్ సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పింది.

న‌చికేత అనుకొని…

దిల్ సినిమాకు దిల్‌రాజు ప్రొడ్యూస‌ర్‌. ఆ సినిమా సెట్స్‌లో దిల్‌రాజు ఆర్య క‌థ‌ను చెప్పారు సుకుమార్‌. ఆ క‌థ న‌చ్చ‌డంతో సుకుమార్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ అల్లు అర్జున్ హీరోగా ఆర్య సినిమాను నిర్మించారు దిల్‌రాజు.

ఆర్య పెద్ద హిట్ట‌వ్వ‌డంతో ద‌ర్శ‌కుడిగా సుకుమార్ పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఆర్య సినిమాకు సుకుమార్ తొలుత అనుకున్న పేరు న‌చికేత. కానీ ఆ టైటిల్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుందో లేదో అని ఆర్య‌గా మార్చేశారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024