





Best Web Hosting Provider In India 2024

Aha OTT: ఆహా ఓటీటీలోని టాప్ 6 బెస్ట్ తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Aha OTT: ఓటీటీలో కేవలం తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియోలో మంచి థ్రిల్ పంచే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో బెస్ట్ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.
Aha OTT: థ్రిల్లర్ జానర్లోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు మరింత థ్రిల్ పంచుతాయి. ఇలాంటి సినిమాలు సాధారణంగా మలయాళం ఇండస్ట్రీ ఎక్కువగా వస్తాయి. అయితే తెలుగులోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఏవో ఒకసారి చూద్దాం.
భూతద్దం భాస్కర్ నారాయణ
భూతద్దం భాస్కర్ నారాయణ గతేడాది వచ్చిన మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఓ చిన్న పట్టణానికి చెందిన ఓ డిటెక్టివ్ 18 ఏళ్లుగా జరుగుతున్న అంతుబట్టని హత్యల మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. శివ కందుకూరి, రాశీసింగ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.
షణ్ముఖ
ఆహా వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే అడుగుపెట్టిన మూవీ షణ్ముఖ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కనిపించకుండా పోయిన యువతులు, వాళ్ల బాయ్‌ఫ్రెండ్స్ హత్యకు గురి కావడంపై ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఓ పోలీస్ అధికారి కలిసి సాగించే వేటే ఈ షణ్ముఖ మూవీ.
యేవమ్
యేవమ్ గతేడాది తెలుగులో వచ్చిన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. చాందినీ చౌదరి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. ఆ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుంటుంది? మహిళలు, చిన్నారులను అతడు ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నాడన్నది ఈ మూవీలో చూడొచ్చు.
రక్షణ
ఇది కూడా గతేడాది ఆహా వీడియోలోకి అడుగుపెట్టిన ఫిమేల్ సెంట్రిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీయే. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో నటించింది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకునే క్రమంలో వచ్చే ట్విస్టులు మూవీలో ఆసక్తి రేపుతాయి.
రేఖాచిత్రమ్
తెలుగులో అందుబాటులో ఉన్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఇది. 40 ఏళ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసును ఓ పోలీస్ అధికారి సవాలుగా తీసుకొని ఎలా పరిష్కరిస్తాడో ఈ సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది. సోనీలివ్ తోపాటు ఆహా వీడియో ఓటీటీలోనూ సినిమా అందుబాటులో ఉంది.
అనసూయ
అనసూయ 2007లో వచ్చిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఇందులో భూమిక, రవిబాబు నటించారు. వరుస హత్యల గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఓ జర్నలిస్ట్ మొత్తానికి కిల్లర్ ను పట్టుకుంటుంది. ఆ కిల్లర్ బయటకు వచ్చిన తర్వాత అందరూ చనిపోయారని అనుకుంటారు. కానీ ఆ తర్వాత జరిగే ఘటనలు వణుకు పుట్టిస్తాయి.
సంబంధిత కథనం