





Best Web Hosting Provider In India 2024

ఆరోగ్యానికి మేలు చేసే చుక్కకూర చపాతీ రెసిపీ ఇదిగో, డయాబెటిస్ ఉన్నవారు తింటే ఎంతో మంచిది
చుక్కకూర పుల్లగా ఉంటుంది. చుక్కకూరను చపాతీలలో కలిపి చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవి డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చుక్కకూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో అందుతాయి. చుక్కకూర చపాతీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుక్కకూర తినడం వల్ల మనకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు జీర్ణవ్యవస్థకు, శ్వాసకోశ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. చుక్కకూర చపాతీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
చుక్కకూర చపాతీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చుక్కకూర తరుగు – రెండు కప్పులు
గోధుమ పిండి – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర పొడి – అర స్పూను
నూనె – కాల్చడానికి సరిపడా
ధనియాల పొడి – అర స్పూను
చుక్కకూర చపాతీ రెసిపీ
1. చుక్కకూరను సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. దాన్ని నీళ్లు కలిపి శుభ్రం చేసుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి చుక్కకూర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
3. అందులో అర స్పూను ఉప్పు, జీలకర్ర పొడి , ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. అది ముద్దలాగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
4. ఇప్పుడు చపాతీ పిండిని ఒక గిన్నెలో వేసి చుక్కకూర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
5. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను నూనె వేసి, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
6. పిండి కలిపి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి.
7. ఇప్పుడు పెనాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు మిశ్రమం నుంచి చిన్న ముద్దను తీసి చపాతీలా ఒత్తుకుని కాల్చుకోవాలి.
8. అంతే చుక్కకూర చపాతీ సిద్ధమైనట్టే.
ఈ చపాతీలను చికెన్ కూరతో తింటే చాలా రుచిగా ఉంటాయి. చుక్క కూరలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో అవసరం. చుక్కకూరలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చుక్క కూరను ఇండియన్ సోరెల్ అంటారు. చుక్కకూరను దక్షిణాసియాలో అధికంగా తింటారు.
సంబంధిత కథనం