




Best Web Hosting Provider In India 2024

Shiva Rajkumar: షూటింగ్ చివరిలో నాకు క్యాన్సర్ వచ్చింది, రామ్ చరణ్ తీరు నన్ను ఆకట్టుకుంది: కన్నడ సూపర్ స్టార్ కామెంట్స్
Shiva Rajkumar About His Cancer And Ram Charan Character: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల రిలీజ్ అయిన 45 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న శివరాజ్ కుమార్ తన క్యాన్సర్ వంటి, ఇతర విషయాలను తెలిపారు.
Shiva Rajkumar About His Cancer And Ram Charan Character: కన్నడ నాట సూపర్ స్టార్‌గా ఎదిగారు శివరాజ్ కుమార్. రజనీకాంత్ జైలర్ సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే, శివరాజ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 45.
ముగ్గురు పాపులర్ స్టార్స్
కన్నడ నాట పాపులర్ హీరోలు అయిన శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నటుడు రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన సినిమానే 45. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంగీత దర్శకుడు అర్జున్ జన్యా డైరెక్టర్‌గా మారారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 45 మూవీ టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.
క్యాన్సర్ గురించి
ఈ సందర్భంగా 45 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తనకు వచ్చిన క్యాన్సర్ గురించి చెప్పడంతోపాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నువ్వే న్యాయం చేయగలవని
“దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్‌ను ఒప్పించాను” అని శివరాజ్ కుమార్ తెలిపారు.
కథే సినిమాకు హీరో
“45 సినిమాలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఉపేంద్ర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ రోజు రాజ్ బి శెట్టి ఈవెంట్‌కు రాలేకపోయారు. 45 సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు హీరో. కథే మెయిన్ స్కోర్ చేస్తుంది” అని కన్నడ సూపర్ స్టార్ పేర్కొన్నారు.
ఎన్నో మినహాయింపులు ఇస్తామన్నారు
“డైరెక్టర్ అర్జున్‌కు మంచి పేరొస్తుంది. కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను. నాకు మా మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్నారు. కానీ, నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా క్యారెక్టర్‌కు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను” అని శివరాజ్ కుమార్ చెప్పారు.
పెద్ది చిత్రంలో నటిస్తున్నాను
“రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తున్నాను. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించబోతున్నా” అని శివరాజ్ కుమార్ తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం