





Best Web Hosting Provider In India 2024

తెలంగాణ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే.. అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అనుమతి
తెలంగాణ గ్రూప్1 నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సెంటర్లలో పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఎంపిక కావడంపై 20మంది అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించాలని నియామకాలుమాత్రం తుది తీర్పుకు లోబడాలని చెెప్పింది.
తెలంగాణలో గ్రూప్ 1న నియామకాలు సందిగ్ధంలో పడ్డాయి. గ్రూప్1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 19మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. వారికి నియామక పత్రాలను మాత్రం తుది తీర్పు తర్వాత అందించాలని ఆదేశించింది.
ఏప్రిల్ 16 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్…
టీజీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉందని పేర్కొంది. ఎంపికైన వారు ఒరిజినల్ ధ్రువపత్రాలతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించింది.
563 ఖాళీలు
గ్రూప్-1 సర్వీసెస్ పరిధిలోని 563 ఖాళీలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు, మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.30 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అలాగే రిజర్వ్ డే 22/04/2025 ఉదయం 10:30 నుండి సాయంత్రం 5.30 వరకు సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంలో (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు
వెరిఫికేషన్ మెటీరియల్‌ను 10/04/2025 నుంచి కమిషన్ వెబ్‌సైట్ ( https://www.tspsc.gov.in ) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వచ్చేటప్పుడు అభ్యర్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లను, రెండు సెట్ల ఫోటోస్టాట్ కాపీలను స్వీయ-ధృవీకరణ చేసి తీసుకురావాలని టీజీపీఎస్సీ సూచించారు.
ఏప్రిల్ 15 నుంచి వెబ్ ఆప్షన్లు
గ్రూప్-1 అభ్యర్థులు 15/04/2025 నుంచి 22/04/2025 సాయంత్రం 5.00 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్/రిజర్వ్ డే రోజున ఎవరైనా అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్‌లను తీసుకురాకపోతే, వారికి మరోసారి సమయం కేటాయించరు.
కేటాయించిన తేదీ/రిజర్వ్ రోజున సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఏ అభ్యర్థి అయినా గైర్హాజరైతే, అభ్యర్థులను తదుపరి ప్రాసెస్ కు అనుమతించరు. గైర్హాజరు, తిరస్కరణలు, అభ్యర్థులు వేసిన ఆప్షన్లు మొదలైన వాటి కారణంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో ఏదైనా లోటు ఏర్పడితే, అవసరమైన అదనపు అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
సంబంధిత కథనం
టాపిక్