



Best Web Hosting Provider In India 2024
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2025 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; ఈ డైరెక్ట్ లింక్ తో చెక్ చేసుకోండి
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఫైనల్ ఆన్సర్ కీ 2025 విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్ సైట్ csirnet.nta.ac.in లో చెక్ చేసుకోవచ్చు. లేదా కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ను ఉపయోగించుకుని ఫైనల్ ఆన్సర్ కీ ని చూడవచ్చు.
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్ష తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తుది ఆన్సర్ కీని సీఎస్ఐఆర్ నెట్ అధికారిక వెబ్సైట్ csirnet.nta.ac.in లో చూసుకోవచ్చు.
2 లక్షలకు పైగా విద్యార్థులు
2025 ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 2 తేదీల్లో దేశవ్యాప్తంగా 164 నగరాల్లో ఉన్న 326 పరీక్షా కేంద్రాల్లో 2,38,451 మంది అభ్యర్థులకు ఎన్టీఏ ఈ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షను నిర్వహించింది. అనంతరం, మార్చి 11న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల కాగా, అభ్యర్థులు 2025 మార్చి 14 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది.
ఆబ్జెక్షన్ విండో
అభ్యర్థులు నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి ఆన్సర్ కీని సవాలు చేసే అవకాశం కల్పించింది. అభ్యర్థుల అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలించి, ఒకవేళ ఎవరైనా అభ్యర్థి చేసిని సవాలు కరెక్ట్ అని తేలితే ఆన్సర్ కీని సవరించి తదనుగుణంగా ఫైనల్ ఆన్సర్ కీ ని రూపొందించింది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఫలితాలు 2025ను తయారు చేస్తారు.
సిఎస్ఐఆర్ యుజిసి-నెట్ ఫైనల్ ఆన్సర్ కీ 2025: డౌన్లోడ్ చేయడం ఎలా?
- ముందుగా సిఎస్ఐఆర్ యుజిసి-నెట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- హోమ్ పేజీలో సీఎస్ఐఆర్ డిసెంబర్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- ఫైనల్ ఆన్సర్ కీ పీడీఎఫ్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ఫైనల్ ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ పెట్టుకోవాలి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ ఫైనల్ ఆన్సర్ కీ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link