



Best Web Hosting Provider In India 2024
నీట్ పీజీ 2025 నోటిఫికేషన్ విడుదల; నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ; ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడండి..
నీట్ పీజీ నోటిఫికేషన్ 2025ను ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 17, 2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు క్రింద చూడండి. నీట్ పీజీ 2025 పరీక్షను జూన్ 15వ తేదీన నిర్వహించనున్నారు.
నీట్ పీజీ 2025 నిర్వహణకు అధికారిక నోటిఫికేషన్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ natboard.edu.in ద్వారా అధికారిక నోటిఫికేషన్ ను చూడవచ్చు.
ఏప్రిల్ 17 నుంచి..
అధికారిక షెడ్యూల్ ప్రకారం, అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు ఫారాల సమర్పణ ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులను సమర్పించడానికి మే 7 రాత్రి 11:55 గంటల వరకు అవకాశం ఉంటుంది. నీట్ పీజీ 2025 పరీక్షను జూన్ 15, 2025న నిర్వహిస్తామని, జూలై 15, 2025 నాటికి ఫలితాలు వెలువడుతాయని ఎన్బీఈఎంఎస్ వెల్లడించింది.
అధికారిక వాట్సాప్ ఛానెల్
విద్యార్థులకు సమాచారం అందించడానికి ఎన్బిఇఎంఎస్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను కూడా ప్రారంభించింది. నీట్ పీజీ 2025 కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏప్రిల్ 17 న విడుదల కానుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించనున్నారు.
నీట్ పీజీ 2025: ఎలా అప్లై చేయాలి
ఏప్రిల్ 17వ తేదీన లింక్ యాక్టివేట్ అయిన తరువాత నీట్ పీజీ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:
- ముందుగా ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- హోమ్ పేజీలో నీట్ పీజీ 2025 లింక్పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. అనంతరం, మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్ ను ఉంచండి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
Best Web Hosting Provider In India 2024
Source link