





Best Web Hosting Provider In India 2024

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Horror Thriller: కన్నడ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా గత వారం కన్నడలో స్ట్రీమింగ్ కు రాగా.. గురువారం (ఏప్రిల్ 17) నుంచి తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
OTT Horror Thriller: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా పేరు రాక్షస. నిజానికి ఇదొక కన్నడ మూవీ. ఏప్రిల్ 11 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఆరు రోజుల తర్వాత తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.
రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్
టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ సినిమాగా ఈ రాక్షస తెరకెక్కింది. మార్చి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తొలి వారం కేవలం కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా తెలుగు వెర్షన్ కూడా తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
“సూపర్ హిట్ రాక్షస ఇప్పుడు తెలుగులో మీ సన్ నెక్ట్స్‌లో.. నిజమైన హారర్ ఏంటో ఇప్పుడే చూసి తెలుసుకోండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. నిజానికి కన్నడ, తెలుగు వెర్షన్లు రెండూ ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు గత వారం ఆ ఓటీటీ ప్రకటించినా.. తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కన్నడ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీల్లోనూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఓటీటీలో మాత్రం కేవలం తెలుగు, కన్నడ వెర్షన్లే ఉన్నాయి. మిగిలిన వాటిపై ఎలాంటి అప్డేట్ లేదు.
రాక్షస మూవీ ఎలా ఉందంటే?
రాక్షస మూవీని లోహిత్ హెచ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ లీడ్ రోల్లో నటించాడు. అతనితోపాటు సోనల్ మోంటీరో, అర్నా రాథోడ్, శోభరాజ్ నటించారు. ఇదొక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సత్య చుట్టూ తిరిగే కథ. తన కూతురిని అతీత శక్తుల నుంచి కాపాడటం అనే టైమ్ లూప్ లో చిక్కుకుంటాడు. ఓ పోలీస్ ఎవిడెన్స్ రూమ్ లో అతనికి ఓ బ్రహ్మరాక్షుసుడు ఎదురవుతాడు.
ఆ రాక్షసుడి శక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దానికి అడ్డుకట్ట వేసి తనపై జరుగుతున్న కుట్రను ఎలా ఛేదించాడన్నదే ఈ సినిమా స్టోరీ. ఇందులో సత్య పాత్రలో ప్రజ్వల్ దేవరాజ్ నటించాడు. హారర్ కు టైమ్ లూప్ అనే కాన్సెప్ట్ జోడించి తీసిన సినిమాయే ఈ రాక్షస.
ఈ ఏడాది జనవరిలోనే రాక్షస సినిమా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆ ట్రైలరే బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా థియేటర్లలో రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం