




Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ..
OTT Romantic Comedy: రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
OTT Romantic Comedy: ఓటీటీలోకి కొత్తగా మరో రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న ‘మేరే హస్బెండ్ కి బీవీ’ థియేటర్లలో రిలీజైనప్పుడు దాని వింత టైటిల్‌తో కొంచెం ఆసక్తి రేపినా, తర్వాత ఆశించినంతగా ఆడలేదు. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ వివరాలు చూడండి.
మేరీ హస్బెండ్ కీ బీవీ ఓటీటీ రిలీజ్ డేట్
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ మేరీ హస్బెండ్ కీ బీవీ. ‘హ్యాపీ భాగ్ జాయేగీ’తో పేరు తెచ్చుకున్న ముదస్సర్ అజీజ్ ఈ సినిమాకు కథ అందించి, దర్శకత్వం వహించాడు. వషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్‌శిఖా దేశ్‌ముఖ్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.
ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్, కలెక్షన్ల పరంగా పెద్దగా మెప్పించకపోయింది. అయితే రొమాంటిక్ కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి ఓటీటీలో ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.
‘మేరే హస్బెండ్ కి బీవీ’ స్టోరీ ఇదీ..
ఈ సినిమా ఢిల్లీలో జరిగే కథి. అంకుర్ (అర్జున్ కపూర్) అనే ప్రొఫెషనల్ తన మాజీ భార్య, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్‌తో ముడిపడిన ప్రేమ వ్యవహారంలో చిక్కుకుంటాడు. అభిప్రాయ భేదాల వల్ల అంకుర్ తన భార్య ప్రభ్లీన్ కౌర్ (భూమి పెడ్నేకర్)కి విడాకులు ఇస్తాడు. మూడేళ్ల తర్వాత, కాలేజీలో తను ఇష్టపడిన అమ్మాయి అంతరా ఖన్నా (రాకుల్ ప్రీత్ సింగ్)కి అంకుర్ అనుకోకుండా ప్రపోజ్ చేసినప్పుడు.. ప్రభ్లీన్ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది.
కారు ప్రమాదం వల్ల ప్రభ్లీన్‌కు గత ఐదేళ్ల జ్ఞాపకాలు గుర్తుండవు. తన విడాకులు కూడా ఆమెకు గుర్తుండకపోవడంతో.. తను ఇంకా అంకుర్‌ను పెళ్లి చేసుకున్నానని చెబుతూ అతని జీవితంలోకి తిరిగి వస్తుంది. దీంతో అతని జీవితం మలుపు తిరుగుతుంది. తన గతంలోని భార్యతో, ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్‌తో తన సంబంధాలను చక్కదిద్దడానికి అంకుర్ చేసే ప్రయత్నాలు అపార్థాలకు, భావోద్వేగ ఘర్షణలకు, ఫన్నీ డ్రామాకు దారి తీస్తాయి.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. కేవలం రూ.10.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
సంబంధిత కథనం