




Best Web Hosting Provider In India 2024

Murder Mystery Movie:బండ్ల గణేష్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్- సింగిల్ క్యారెక్టర్‌తో!
Murder Mystery Movie: బండ్ల గణేష్ హీరోగా నటించిన సింగిల్ క్యారెక్టర్ మూవీ డేగల బాబ్జీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో నేషనల్ అవార్డును గెలుచుకున్న ఒత్త సెరప్పు సైజ్ 7 ఆధారంగా డేగల బాబ్జీ మూవీ రూపొందింది.
Murder Mystery Movie: బండ్ల గణేష్ హీరోగా నటించిన తెలుగు మూవీ డేగల బాబ్జీ యూట్యూబ్‌లో ఇటీవల రిలీజైంది. ఫ్రీగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. డేగల బాబ్జీ మూవీకి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు.
తమిళ రీమేక్…
తమిళంలో విజయవంతమైన ఒత్త సెరప్పు సైజ్ 7 అనే మూవీ ఆధారంగా డేగల బాబ్జీ మూవీ తెరకెక్కింది. తమిళ మూవీలో పార్తీబన్ హీరోగా నటించాడు. తమిళంలో ఈ మూవీ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. తెలుగు రీమేక్ మాత్రం ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.
బండ్ల గణేష్ ఒక్కడే…
డేగల బాబ్జీ ఆరంభం నుంచి చివరి వరకు స్క్రీన్‌పై కేవలం బండ్ల గణేష్ మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన ఆర్టిస్టుల వాయిస్‌లు మాత్రమే వినిపిస్తాయి. కానీ వారు మాత్రం స్క్రీన్‌పై కనిపించరు. సింగిల్ లొకేషన్‌లోనే పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మొత్తం సాగుతుంది. డేగల బాబ్జీ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
మర్డర్ ఇన్వేస్టిగేషన్‌లో…
ఓ మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌లో భాగంగా డేగల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆ మర్డర్ తానే చేసినట్లు డేగల బాబ్జీ ఒప్పుకుంటాడు. ఆ మర్డర్‌తో పాటు మరికొంత మందిని హత్య చేసినట్లు చెబుతాడు. నిజంగానే అతడు ఆ మర్డర్స్ చేశాడా? బాబ్జీ చేతిలో చనిపోయిన వాళ్లు ఎవరు? హంతకుడైన బాబ్జీకి పోలీసులు ఎలాంటి శిక్షను విధించారు? అతడిని నిర్దోషిగా వదిలేశారా? అన్నదే డేగల బాబ్జీ మూవీ కథ.
కమెడియన్‌గా…నిర్మాతగా…
కమెడియన్‌గా బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభమైంది. వినోదం, సుస్వాగతం, నువ్వు నాకు నచ్చావ్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరితో పాటు పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రవితేజ ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారాడు. గబ్బర్‌సింగ్, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్‌తో పాటు మరికొన్ని సినిమాలు నిర్మించాడు. గత కొన్నేళ్లుగా నటనకు, సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.
సంబంధిత కథనం