Star Maa Serials TRP Ratings: బ్రహ్మముడి సీరియల్ దూకుడు.. మిగిలిన సీరియల్స్ అన్నీ ఢమాల్.. తగ్గిన టీఆర్పీ రేటింగ్స్

Best Web Hosting Provider In India 2024

Star Maa Serials TRP Ratings: బ్రహ్మముడి సీరియల్ దూకుడు.. మిగిలిన సీరియల్స్ అన్నీ ఢమాల్.. తగ్గిన టీఆర్పీ రేటింగ్స్

Hari Prasad S HT Telugu

Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. అయితే అనూహ్యంగా బ్రహ్మముడి సీరియల్ తన రేటింగ్ మెరుగుపరచుకోగా.. మిగిలిన సీరియల్స్ రేటింగ్స్ మొత్తం చాలా తగ్గడం గమనార్హం.

బ్రహ్మముడి సీరియల్ దూకుడు.. మిగిలిన సీరియల్స్ అన్నీ ఢమాల్.. తగ్గిన టీఆర్పీ రేటింగ్స్

Star Maa Serials TRP Ratings: బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో మరోసారి సత్తా చాటింది. ఈ సీరియల్ టైమ్ మారిన తర్వాత క్రమంగా టాప్ లో నుంచి కిందికి వెళ్లిపోగా.. తాజాగా 14వ వారం రేటింగ్స్ లో మాత్రం మరోసారి తన రేటింగ్ ను కాస్త మెరుగుపరుచుకుంది. అయితే కార్తీకదీపం 2తోపాటు మిగిలిన సీరియల్స్ రేటింగ్స్ అన్నీ దారుణంగా పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 14వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. గత వారం తన టాప్ ర్యాంకింగ్ కోల్పోయిన కార్తీకదీపం 2 సీరియల్ ఈసారి మళ్లీ టాప్ లోకి వచ్చింది. అయితే ఈ సీరియల్ సహా మిగిలిన టాప్ 5 సీరియల్స్ రేటింగ్స్ పడిపోయాయి.

కార్తీకదీపం 2 సీరియల్ కు 10.75 రేటింగ్ నమోదైంది. ఇక గుండెనిండా గుడిగంటలు 10.56 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 10.16తో మూడో స్థానంలో, ఇంటింటి రామాయణం 10.11తో నాలుగో స్థానంలో నిలిచాయి. చిన్ని 7.79తో ఐదో స్థానంలో, నువ్వుంటే నా జతగా 7.21తో ఆరో స్థానంలో ఉన్నాయి.

మెరుగైన బ్రహ్మముడి రేటింగ్

అన్ని స్టార్ మా సీరియల్స్ రేటింగ్స్ ఈవారం పడిపోగా.. అనూహ్యంగా బ్రహ్మముడి రేటింగ్ మాత్రం మెరుగైంది. ప్రైమ్ టైమ్ నుంచి వెళ్లిపోయి మధ్యాహ్నం 1.30 గంటలకు టెలికాస్ట్ అవుతున్న తర్వాత బ్రహ్మముడి క్రమంగా తన రేటింగ్ కోల్పోయిన విషయం తెలిసిందే.

అక్కడ కూడా ప్రతి వారం 6కుపైగా రేటింగ్ సాధిస్తూ వస్తోంది. అయితే 14వ వారం మాత్రం ఏకంగా 7.19 రేటింగ్ సాధించింది. అంటే చిన్ని, నువ్వుంటే నా జతగా లాంటి సీరియల్స్ కు పోటీగా రేటింగ్ సాధించడం విశేషం.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ కూడా పడిపోయాయి. 14వ వారానికి సంబంధించి ఆ ఛానెల్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జీ తెలుగులో చామంతి సీరియల్ 6.61తో టాప్ లో ఉంది.

ఇక పడమటి సంధ్యారాగం 6.54, మేఘసందేశం 6.23 రేటింగ్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జగద్ధాత్రి 6.05, అమ్మాయిగారు 5.03 రేటింగ్స్ సాధించాయి. ఇక ఈ ఛానెల్లో ఈ మధ్యే కొత్తగా మొదలైన దీర్ఘసుమంగళీభవ సీరియల్ తొలి వారం 3.72 రేటింగ్ తో ఫర్వాలేదనిపించింది. ఈ సీరియల్ స్టార్ మాలో బ్రహ్మముడి టెలికాస్ట్ అయ్యే మధ్యాహ్నం 1.30 గంటలకే వస్తోంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024