





Best Web Hosting Provider In India 2024

యేసు ఈ భూమిపై ఎన్నాళ్ళు జీవించారు? శిలువ వేసే సమయానికి అతని వయసు ఎంత?
యేసు మరణించిన రోజే గుడ్ ఫ్రైడే. ఆయన మరణ దినాన్ని ఈ రోజే స్మరించుకుంటారు క్రైస్తవ సోదరులు. అయితే శిలువ వేసే సమయానికి జీసస్ కు ఎంత వయసు ఉందో మీకు తెలుసా?
యేసు ఈ భూమిపై జీవించినది తక్కువ సంవత్సరాలే. ఆయన తన యువ వయసులోనే మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మరణాన్నే గుడ్ ఫ్రైడేగా నిర్వహించుకుంటారు. గుడ్ ఫ్రైడేను లూనార్ క్యాలెండర్ ఆధారంగా క్రైస్తవ మతాధికారులు నిర్ణయిస్తారు. ఈ పండుగ ఈసారి ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ప్రతి ఏడాది మార్చి 21 తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి ఆధారంగా ఈస్టర్, గుడ్ ఫ్రైడే పండగలను నిర్ణయిస్తారు. మార్చి 21 తర్వాత మొదటి పౌర్ణమి గడిచిన వెంటనే వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని, ఆదివారాన్ని ఈస్టర్ అని నిర్వహించుకుంటారు.
మార్చి 21 తేదీకి ఒక ప్రత్యేకత ఉంది… అందుకే ఆ తేదీనే బట్టే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు నిర్ణయిస్తారు. మార్చి 21న రాత్రి పగలు సమంగా ఉంటాయని చెబుతారు.
గురువారమే యేసును బంధించి
బైబిల్ చెబుతున్న ప్రకారం యేసును శిలువ వేయడానికి గురువారమే బంధించారని చెబుతారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మత నాయకులు అతనిపై విచారణ జరిపారు. యేసుపై రాజద్రోహం ఆరోపణలను మోపారు. రోమన్ చక్రవర్తి పొంటిఎస్ పిలాతు ముందు ఆయనను హాజరపరిచారు. యేసుకు మరణశిక్షను వేస్తాడు పిలాతు.
యేసును కొరడాలతో కొట్టి శిలువ వేస్తారు. శిలువ వేశాక యేసు కొన్ని గంటల పాటు సజీవంగా ఉన్నారని చెప్పకుంటారు. ఆయన శిలువనుండే ఏడు సార్లు మాట్లాడినట్టు బైబిల్ చెబుతోంది. ఆయన దైవాన్ని ప్రార్థించడం, తన పక్కన ఉన్న ఒక దొంగతో మాట్లాడడం, అలాగే తన తల్లితో మాట్లాడడం, దాహం వేస్తున్నట్టు చెప్పడం ఇలా మొత్తం 7 విషయాలు ఆయన మాట్లాడినట్టు బైబిల్ వివరిస్తుంది.
యేసు శిలువ పైనే తొమ్మిది గంటల పాటూ జీవించి ఉన్నట్టు చెబుతారు. అతను మరణించే సమయం మధ్యాహ్నం మూడు గంటలు అని అంటారు. అందుకే గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలామంది ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో రోదిస్తూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు.
యేసు వయసు ఎంత?
యేసు ఈ భూమిపై 33 ఏళ్లు జీవించారని అంటారు. యేసు మరణించే సమయానికి ఆయన వయస్సు విషయంలో ఇప్పటికీ అస్పష్టత ఉంది. కొందరు 30 సంవత్సరాలని చెబితే, మరికొందరు 33 సంవత్సరాలు అని నమ్ముతారు. బైబిల్ చెబుతున్న ప్రకారం యేసు… క్రీస్తుశకం 6 నుండి 4 శతాబ్దం మధ్యలో జన్మించారు. జెరూసలేం నగరానికి దక్షిణాన పది కిలోమీటర్ల దూరంలో బెత్లెహాం అనే ప్రాంతంలో యేసుక్రీస్తు జన్మించినట్టు బైబిల్ లో ఉంది. యేసుక్రీస్తు మరణం క్రీస్తుపూర్వం 30 నుంచి క్రీస్తుపూర్వం 36వ శతాబ్దం జరిగినట్టు లెక్కిస్తారు. యేసును కన్న తల్లి మేరీ అని చెబుతారు. కానీ తండ్రి విషయంలో మాత్రం గందరగోళం ఉంది. యేసుకు జీవ సంబంధమైన తండ్రి లేడని… అతని పుట్టుక దైవిక జోక్యం వల్ల జరిగిందని కథనాలు వినిపిస్తూ ఉంటాయి.
చరిత్రలో మాత్రం యేసుక్రీస్తు తల్లిదండ్రులుగా మేరీ, జోసెఫ్ ల పేరును చెబుతారు. యేసు ఒక గుర్రపు శాలలో జన్మించాడని అంటారు. మేరీ, జోసెఫ్‌లు బెత్లెహేము నగరానికి చేరుకున్నప్పుడు వారు విడిది చేయాల్సిన సత్రం జనాలతో నిండిపోయింది. అక్కడ ఉండడానికి వీలు లేక గర్భవతి అయిన మేరీ గుర్రపుసాలలో బస చేసిందని చెబుతారు. అక్కడే యేసు జన్మించాడని అంటారు.
సంబంధిత కథనం