





Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: ప్రభావతి కన్నింగ్ ప్లాన్ -అత్తింటికి మీనా దూరం -రోహిణిని వణికించిన బాలు
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 18 ఎపిసోడ్‌లో కామాక్షితో పర్సనల్‌గా మాట్లాడాలని ప్రభావతి అనుకుంటుంది. ప్రభావతి మొహం ముందే రవి, మనోజ్ రూమ్ తలుపులు వేసుకుంటారు. తన రూమ్ ఇవ్వడానికి బాలు ఒప్పుకోడు. మరోవైపు రోహిణి పార్లర్ అమ్మేసిన సంగతి బాలు కనిపెడతాడు.
Gunde Ninda Gudi Gantalu Serial: కామాక్షికి ఫోన్ చేసి ఓ సీక్రెట్ చెప్పాలని, ఇంటికి రమ్మని అంటుంది ప్రభావతి. ఇంట్లో అడుగుపెడుతూనే ఇంకా పూల కొట్టు తెరవలేదా అని ప్రభావతిని అడుగుతుంది కామాక్షి. ఆ షాప్ పేరు ఎత్తితే నాకు కంపరంగా ఉంటుందని ప్రభావతి చిర్రుబుర్రులాడుతుంది. రవి రూమ్‌లోకి వెళ్లి మాట్లాడుకుందామని కామాక్షితో అంటుంది ప్రభావతి.
కామాక్షి వెటకారం…
రవి రూమ్ దగ్గరకు వెళతారు ఇద్దరు. అప్పుడే రవిని రూమ్ నుంచి బయటకు గెంటేసి తలుపు వేసేస్తుంది శృతి. నగల బాక్స్ తెచ్చిన కోడలు కదా… అందుకే మొహం మీదే తలుపు వేసిందని పంచ్‌లు వేస్తుంది కామాక్షి. ఈ పిల్లతోనే కదా లేచిపోయిపెళ్లిచేసుకుంది అని రవితో వెటకారం ఆడుతుంది కామాక్షి.
మీ అత్తయ్య మొహం మీదే తలుపువేశావు, కొంచెం ఉంటే ముక్కు పచ్చడి అయ్యేదని శృతితో కామాక్షి అంటుంది. ప్రభావతికి సారీ చెబుతుంది శృతి. డ్రెస్ మార్చుకోవడానికి రవిని బయటకు పంపించానని అంటుంది. రవిని ఎలా బయటకు పంపించామో మేము చూశామని కామాక్షి అంటుంది.
పనికిమాలిన మనుషులు…
రవి రూమ్‌లో మాట్లాడటం కదురకపోవడంతో మనోజ్ రూమ్‌కు వస్తారు. రోహిణి కోపంతోచిటపటలాడుతుంది. ఛీ ఛీ పలికిమాలిన మనుషులు అంటూ కోపంగా అంటుంది రోహిణి. తమనే రోహిణి అందనుకొని ప్రభావతి, కామాక్షి కంగారు పడతారు. నిద్రపోతున్న మనోజ్‌పై మాటల దాడి మొదలుపెడుతుంది. ఊరి నుంచి రాగానే మంచి జాబ్ వెతుక్కుంటానన్నావు. ఇక్కడికి వచ్చి చేసే పని ఇదేనా…లక్షలు దొరికితే మింగుతావా అని మనోజ్‌కు క్లాస్ ఇస్తుంది రోహిణి. నీ మాటలు ఎవరైనా వింటారని మనోజ్ రూమ్ డోర్ వేస్తాడు.
నీకే రూమ్ లేకుండాపోయింది…
బాలు రూమ్‌లో మాట్లాడుకుందామని వస్తారు. బాలు మాత్రం తన రూమ్ ఇవ్వనని అంటాడు. తాను బయటకు వెళితే రూమ్ తాళం వేసుకొని వెళతానని వాళ్ల ముందు డోర్ వేసుకుంటాడు. నీ ఇళ్లు అని రోజుకు లక్షసార్లు చెబుతుంటావు. కానీ నీ ఇంట్లో నీకే రూమ్ లేకుండా పోయిందని ప్రభావతితో వెటకారంగా అంటుంది ప్రభావతి.
ప్రభావతి కుట్ర….
డాబాపైన ఓ రూమ్ కట్టుకోమని ప్రభావతికి సలహా ఇస్తుంది కామాక్షి. సత్యం కూడా రూమ్ కడతానని అంటున్నాడని, కానీ తానే వద్దంటున్నానని ప్రభావతి చెబుతుంది. మూడు రూమ్‌లు ఉంటే బాలు, మీనాలను ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి పంపించేయచ్చు. అదే ఇంకో రూమ్ కడితే ఇక్కడే ఉండిపోతాడు. ఎంతో ఆలోచించి బాలును ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్నా. కానీ ఇంటి ముందే పూల కొట్టు పెట్టాడని బాలుపై ఫైర్ అవుతుంది. ఇంత పెద్ద కుట్ర పన్నావా అని కామాక్షి అంటుంది.
తోపుడు బండి…
పూలకొట్టుకు నీ పేరే పెట్టి నీ మీద ఉన్న ప్రేమను బాలు చూపించాడు కదా కామాక్షి అంటుంది. అదేమైనా పెద్ద షాపా…ముష్టి తోపుడుబండి అంటూ చులకనగా మాట్లాడుతుంది ప్రభావతి. ఆ తోపుడు బండిని తీసేస్తానని అంటుంది. రోహిణి నా పేరు మీద పార్లర్ పెట్టిందని గొప్పలు చెబుతుంది. అప్పుడే అక్కడికి మీనా వస్తుంది. మేం ఏం మాట్లాడుకుంటున్నామో విందామని వచ్చావా అని ప్రభావతి ఫైర్ అవుతుంది.
ప్రభావతి కామెడీ…
పూల కొట్టు వ్యాపారం ఎలా సాగుతుందని మీనాను అడుగుతుంది కామాక్షి. బాగా సాగుతుందని మీనా బదులిస్తుంది. అవును మరి కోట్లు ఖర్చు పెట్టి మొదలుపెట్టిన వ్యాపారం కదా అని ప్రభావతి వెటకారం ఆడుతుంది. మీనా వెళ్లిపోగానే రోహిణి మావయ్య వచ్చారని, ఈ సారి వాళ్ల నాన్న వస్తాడని చెప్పాడని అంటుంది.
ఆయన ఇచ్చిన డబ్బుతో మూడు ఫ్లోర్లు వేస్తానని చెబుతుంది. ఇళ్లు ఎలా ఉండాలో గొప్పలు చెబుతుంది. ఇళ్లంతా రిచ్‌గా ఉండాలని అంటుంది. రెండు వందల గజాల్లో పెద్ద విల్లానే ప్లాన్ చేస్తున్నావు. నీ ప్లాన్స్ భలే కామెడీగా ఉంటాయని కామాక్షి సెటైర్ వేస్తుంది.
అప్పుల పాలు…
విద్యతో కలిసి రోహిణి పార్లర్‌కు బయలుదేరుతుంది. వారిని మాణిక్యం చూస్తాడు. రోహిణికి మటన్ ఇవ్వడానికి ఆమెను వెతుక్కుంటూ పార్లర్ వస్తాడు. మాణిక్యం వల్ల పల్లెటూళ్లో తాను ఎదుర్కొన్న కష్టాలు విద్యకు చెబుతుంది రోహిణి. మీ నాన్నను అడిగి కిలో బంగారం తెప్పించమని అత్తయ్య పోరు పెడుతుందని అంటుంది. అత్తింటి వాళ్ల వల్ల అప్పుల పాలయ్యానని వాపోతుంది. దినేష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నానని, గుణకు అప్పు ఎలా కట్టాలో తెలియడం లేదని బాధపడుతుంది. ఈ నిజాలు బయటపడితే తన పరిస్థితి ఏమిటో అని భయపడుతుంది.
రాజమౌళి చూశాడా?
రోహిణి, విద్యను వెతుక్కుంటూ పార్లర్‌కు మాణిక్యం వస్తాడు. అతడిని చూసి ఇద్దరు కంగారు పడతారు. అతడిని మరో రూమ్‌లోకి తీసుకెళతారు. తన యాక్టింగ్ రాజమౌళి చూశాడా? మహేష్‌బాబుకు నచ్చిందా అని రోహిణిని అడుగుతాడు మాణిక్యం. ఏ విషయం నాకు చెప్పలేదని అంటాడు.
పార్లర్‌కు రావొద్దు…
పల్లెటూళ్లో తాగేసి గొడవ చేశావటగా అని మాణిక్యానికి క్లాస్ ఇస్తుంది విద్య. మనోజ్ చేత తాగించాడని అతడిపై రోహిణి కూడా ఫైర్ అవుతుంది. నీకు అడ్రస్ తెలిసింది కదా అని మాటిమాటికి పార్లర్‌కు రావొద్దని మాణిక్యానికి వార్నింగ్ ఇస్తుంది రోహిణి. ఇలా అందరికి కనిపించేలా బయట తిరగొద్దని అంటుంది.
తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి అబద్ధం చెప్పడం లేదని, మారుపేరుతో తిరగడం లేదని మాణిక్యం అంటాడు. తన మటన్ కొట్టు పనుల మీద బయట తిరగడం తప్పదని, మటన్ కొట్టడం వృత్తి అయితే…యాక్టింగ్ ప్రవృత్తి అని మటన్ కొట్టు మాణిక్యం బదులిస్తాడు.
రోహిణి చిరాకు…
మాణిక్యం మాటలతో రోహిణి చిరాకు పడుతుంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు నా గెటప్ రివీల్ కాకూడదనే బయట తిరగొద్దని అంటున్నారా అని మాణిక్యం అంటాడు. ఇక నుంచి మంకీ క్యాప్ పెట్టుకొని తిరుగుతానని అంటాడు.
రోహిణి తిప్పలు…
రోహిణి బ్యూటీ పార్లర్ ఓనర్ బాలు కారు ఎక్కుతుంది. పార్లర్ ముందు దిగిన ఆమె డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుంది. వచ్చి రావడంతోనే రోహిణిని పిలుస్తుంది. ఓనర్ కంట మాణిక్యం పడితే తనకు తిట్లు తప్పవని రోహిణి కంగారు పడుతుంది. మాణిక్యాన్ని ఓనర్ చూడకుండా తెలివిగా మ్యానేజ్ చేస్తుంది. క్యాబ్ ఛార్జీల కోసం పార్లర్ లోపలికి బాలు వస్తాడు. బాలుకు డబ్బులు ఇవ్వమని ఎంప్లాయ్‌కి ఓనర్ చెబుతుంది. మాణిక్యాన్ని బయటకు పంపించబోతుంది రోహిణి. కానీ అక్కడ బాలు కనిపించడంతో రోహిణి షాకవుతుంది. అప్పుడే ఆ పార్లర్ రోహిణిది కాదనే నిజం బాలుకు తెలిసిపోతుంది.
పని ఎక్కువైందా?
రోహిణి పార్లర్ నుంచి ఇంటికొస్తుంది. బాగా అలిసిపోయినట్లున్నావు…పని ఎక్కువైందా అని ప్రభావతి అంటుంది. ఈ ఒక్క రోజేనా రోజు పని ఉంటుందా అని బాలు సెటైర్ వేస్తాడు. రోహిణి పార్లర్‌లో ఓనర్స్ పనిచేస్తారు. పనివాళ్లు కష్టపడతారని సెటైర్ వేస్తాడు. బాలుకు నిజం తెలిసిపోయిందని రోహిణి కంగారు పడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం