Odela 2 OTT: థియేటర్లలో డిజాస్టర్ టాక్.. ఓటీటీలోకి నిన్న రిలీజైన తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Odela 2 OTT: థియేటర్లలో డిజాస్టర్ టాక్.. ఓటీటీలోకి నిన్న రిలీజైన తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

Odela 2 OTT Streaming Details: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన ఓదెల 2 స్ట్రీమింగ్ కానుందన్న టాక్ జోరుగా నడుస్తోంది. తమన్నా నటించిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఇదేనంటూ బాలీవుడ్ మీడియా సైట్స్ పేర్కొన్నాయి. మరి ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేస్తే..!

థియేటర్లలో డిజాస్టర్ టాక్.. ఓటీటీలోకి నిన్న రిలీజైన తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Odela 2 OTT Streaming Release: ఓటీటీలోకి నిన్న (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైన తమన్నా ఓదెల 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందనే సమాచారం జోరుగా ప్రచారం జరుగుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా స్ట్రయిట్ తెలుగు మూవీ చేసి చాలా కాలం అయింది.

చిరంజీవి భోళా శంకర్ మూవీలో

అరణ్మనై 4 తమిళ హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగులో బాక్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. దీనికంటే ముందు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది తమన్నా. ఆ తర్వాత తమన్నా భాటియా చేసిన స్ట్రయిట్ తెలుగు మూవీ ఓదెల 2. చాలా కాలం గ్యాప్ తర్వాత తమన్నా తెలుగు సినిమా చేయడం, ఓటీటీలో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ కావడంతో ఓదెల 2పై అంచనాలు భారీగా పెరిగాయి.

రివర్స్‌లో ఓదెల 2 మౌత్ టాక్

ఇక ఓదెల 2 నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికి తగినట్లుగా టీజర్, ట్రైలర్ ఉండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో ఏప్రిల్ 18న గ్రాండ్‌గా విడుదలైన తమన్నా ఓదెల 2 సినిమాకు మౌత్ టాక్ పూర్తి రివర్స్‌లో ఉంది.

ఓదెల 2 రివ్యూలు అలా

ఓదెల 2 సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినప్పటికీ ఆడియెన్స్ నుంచి మాత్రం దారుణమైన రెస్పాన్స్ వినిపిస్తోంది. రొటీన్ కథ, కథనం, అంతగా ఆకట్టుకులోనే విజువల్స్ అంటూ చెబుతున్నారు. కానీ, ఒదెల 2 మొదటి 20 నిమిషాలు మాత్రం చాలా క్రియేటివ్‌గా ఆకట్టుకుందని పాజిటివ్‌ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బాక్సాఫీస్ కలెక్షన్స్ కష్టమే

ఇలా నిన్న థియేటర్లలో విడుదలైన ఓదెల 2 సినిమాకు డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఓదెల 2 కలెక్షన్స్ రాబట్టడం కష్టమే అంటున్నారు. తొలిరోజు ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవని సమాచారం. ఇలాంటి సమయంలో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. సాధారణంగానే థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుంది.

ఓదెల 2 ఓటీటీ రైట్స్

అలాగే ఓదెల 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి చూపుతున్నారు. ఓదెల 2 ఓటీటీ హక్కులను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అన్ని భాషలకు కలిపి రూ. 18 కోట్లకు ఓదెల 2 ఓటీటీ రైట్స్ డీల్ మాట్లాడుకున్నారని సమాచారం. ఈ రిపోర్ట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మైథలాజికల్ హారర్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఓదెల 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు.

ఓదెల 2 ఓటీటీ రిలీజ్

కానీ, సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి నెల రోజుల్లో, లేదా అంతకంటే ముందుగానే ఓదెల 2 ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, ఓదెల 2 సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించగా.. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్ చేశారు. అలాగే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు చేపట్టారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024