




Best Web Hosting Provider In India 2024

బాపట్లలో విషాదంగా మారిన బాప్టిజం.. పెనుమూడిలో కృష్ణా నదిలో మునిగి ఇద్దరు యువకుల మృతి
క్రైస్తవ మత విశ్వాసంలో భాగంగా బాప్టిజం తీసుకుంటూ ఇద్దరు యువకులు కృష్ణా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో పెనుమూడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నది లోతుగా ఉంటుందని వారిస్తున్నా వినకుండా అందులోకి దిగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
క్రైస్తవ మతాన్ని స్వీకరించేందుకు బాప్టిజం తీసుకుంటూ నదిలో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. బాప్టిజం తీసుకుంటూ కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పెనుమూడిలో గురువారం ఈ ఘటన జరిగింది.
కృష్ణా నది తీరం వెంబడి ఉండే భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక పాస్టర్‌తో కలిసి పెనుమూడిలో కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలోకి దిగి బాప్టిజం తీసుకుంటుండగా పెనుమాల దేవదాను, తల కాయల గౌతమ్, పెనుమాల సుధీర్ బాబు, పెనుమాల హర్షవర్ధన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. స్థానికులు గుర్తించి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు(19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు.
స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె పోలీసులు గాలింపు చేపట్టి కొంతసేపటికి వారి మృతదేహాలను వెలికితీసి రేపల్లె ప్రభుత్వ వైద్యశా లకు తరలించారు.
నీటిలో మునిగి అస్వస్థతకు గురైన సుధీర్ బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పాస్టర్‌తో కలిసి యువకులు నదిలో దిగిన చోట లోతు ఎక్కువగా ఉంటుందని చెప్పినా వినకుండా దిగారని స్థానికులు తెలిపారు.
నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన గౌతమ్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా, దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. తమ ఇళ్లలో చెప్పకుండా బాప్టిజం స్వీకరించేందుకు వెళ్లారని మృతుల కుటుంబాలు పోలీసులు తెలిపాయి.
గౌతమ్ తల్లిదండ్రులు సుధాకర్, రజని, దేవదాసు తల్లిదం డ్రులు దేవేంద్ర, నాగలత వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. యువకుల మృతితో వేమవరం గ్రామంలో విషాదం అలముకుంది.
సంబంధిత కథనం
టాపిక్