





Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 18th Episode: అపర్ణను యామినికి అమ్మ అని చెప్పిన రాజ్- మరదలికి షాక్ మీద షాక్- తల్లి పేరు మార్చేసిన రామ్!
Brahmamudi Serial April 18th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 18 ఎపిసోడ్‌లో గుడిలో పూజారికి తల్లి పేరు మార్చి చేబుతాడు రాజ్. అన్నదానంలోకి వచ్చి కూర్చున్న అపర్ణతో తన కొడుకు త్వరగా తన దగ్గరికి వస్తాడని భరోసా ఇస్తాడు. అపర్ణకు బర్త్ డే చేస్తుండంగా వచ్చిన యామినికి షాక్ మీద షాక్ తగులుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో రాజ్, కావ్యను చూసి దంపతులిద్దరు సీతారాముళ్ల చూడముచ్చటగా ఉన్నారు అని పంతులు అంటాడు. పూజారి గారు మేమిద్దిరం భార్యాభర్తలం కాదు. కానీ, ఈవిడ నాకు చాలా బాగా తెలిసినావిడ. చాలా మంచిది అని రాజ్ అంటాడు.
అమ్మ పేరు మీద అర్చన
కావ్యకు పూజారి, రాజ్ ఇద్దరు క్షమాపణ చెబుతారు. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు అని పూజారి అడిగితే.. మా అమ్మ పేరు మీద. ఇవాళ ఆమె పుట్టినరోజు అని రాజ్ అంటాడు. అదంతా చూసిన అపర్ణ తెగ సంబరపడిపోతుంది. మీ అమ్మగారి పేరు అని పూజారి అడిగితే.. కాస్తా చెప్పలేకపోతాడు రాజ్. అపర్ణ అని చెప్పు బాబు అని అపర్ణ అంటూ ఉంటే.. భానుమతి అని రామ్‌గా మారిన రాజ్ అంటాడు. దాంతో అపర్ణ, కావ్య నిరాశపడతారు.
అలా తన తల్లి పేరును తనకు తెలియకుండానే రాజ్ మార్చేస్తాడు. గోత్రం అడిగితే.. రాజ్ చెప్పలేకపోతాడు. నా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి నాకు గోత్రం ఏంటో ఎవరు చెప్పలేదని రాజ్ అంటాడు. ఆ దేవుడి గోత్రంతోనే అర్చన చేస్తాను అని పూజారి లోపలికి వెల్లి పూజ చేస్తుంటాడు. తర్వాత అన్నదానం మొదలుపెడదామా అని రాజ్, కావ్య వెళ్తారు. మరోవైపు రాజ్ ఎక్కడికి వెళ్లాడో జీపీఎస్ ద్వారా చూసిన యామిని టెన్షన్ పడుతుంది.
బావ శివాలయంకు వెళ్లింది నిజమే. కానీ, ఇంకా అక్కడే ఉన్నాడు. అర్చన చేయించినా, పూజ చేయించినా అరగంటలో బయటకు రావొచ్చు. వెళ్లి గంట అయింది. ఇంకా ఎందుకు రాలేదు అని యామిని అంటుంది. ఆయన భక్తి పారవశ్యంలో మునిగిపోయారేమో అని వైధేహి అంటుంది. అలా మునిగిపోవడానికి ఆయనేం భక్త కన్నప్ప కాదు మామ్. జస్ట్‌గా రామ్‌గా మారిన రాజ్, స్వరాజ్ అని యామిని అంటుంది. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు అని తల్లీకూతుళ్లు మాట్లాడుకుంటారు.
మనకే ప్రమాదం
అక్కడ ఎవరినైనా కలిసి ఉండాలి. లేదా ఎవరినైనా కలిసి ఉండాలి. ఏది జరిగినా మనకే ప్రమాదం అని యామిని అంటుంది. నువ్ ఒకసారి గుడికి వెళ్లడమే మంచిదనిపిస్తుంది అని వైధేహి అంటుంది. కానీ, నా మీద ప్రతిదానికి సీరియస్ అవుతున్నాడు. నేను వెంటపడుతున్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు గుడికి వెళ్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడో అని ఆలోచిస్తున్నాను అని యామిని అంటుంది. అలా అనుకుంటే మొదటికే మోసం అవుతుంది. ఇన్నాళ్లు పడిన కష్టం వృథా అవుతుంది అని వైధేహి అంటుంది.
నువ్ మళ్లీ రాజ్ మిస్ అయ్యాడని డిప్రెషన్‌లోకి వెళ్తే మేము తట్టుకోలేం. తిడితే తర్వాత సర్ది చెప్పొచ్చు. కానీ, నీ చేయి దాటకుండా చూసుకో. ముందు అయితే వెళ్లు అని వైధేహి అంటుంది. దాంతో యామిని గుడికి బయలుదేరుతుంది. మరోవైపు అందరికి అన్నదానం చేస్తుంటాడు రాజ్. కావ్య, రాజ్ వడ్డిస్తూ గుద్దుకుంటారు. అదంతా చూసిన అపర్ణ నా కొడుకు చేస్తున్న అన్నదానానికి నేను దూరంగా ఉండటం ఏంటీ అని బంతిలో వెళ్లి కూర్చుంటుంది.
అది చూసి కావ్య షాక్ అవుతుంది. అపర్ణ కూర్చోవడం చూసిన రాజ్ వెళ్లి ప్లేట్ తీసుకెళ్తాడు. ఇందాక మెట్లమీద నుంచి పడిపోతుంటే కాపాడింది మిమ్మల్నే కదా అని రాజ్ అంటే.. అవును బాబు, దేవుడిలా వచ్చి కాపాడావ్ అని అపర్ణ అంటుంది. దానికి మనిషి అయితే చాలు. మీరు ఆకలితో ఎదురుచూసే మనిషిలా కనిపించట్లేదు. మీరే పదిమందికి అన్నం పెట్టేవారిలా కనిపిస్తున్నారు. కానీ, మీరు ఇలా వచ్చి కూర్చోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని రాజ్ అంటాడు.
హ్యాపీ బర్తే డే అమ్మా
నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్ ఇక్కడ అన్నదానం చేసేసరికి ఎందుకో తినాలనిపించింది. అందుకే ఇలా వచ్చాను అని అపర్ణ అంటుంది. ఎందుకలా అని రాజ్ అడుగుతాడు. ఈరోజు నా పుట్టినరోజు కూడా అని అపర్ణ అంటే.. ఆశ్చర్యంగా ఉందే ఈరోజు నా మా అమ్మ పుట్టినరోజు కూడా అని హ్యాపీ బర్త్ డే అమ్మా అని రాజ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. దాంతో మరింత సంబరపడిపోతుంది అపర్ణ.
థ్యాంక్స్ బాబు. ప్రతి సంవత్సరం ఇలాగే గుడికి వచ్చి నా కొడుకు నా పేరు మీద అన్నదానం చేసేవాడు. కానీ, తను ఇప్పుడు నా దగ్గర లేడు. అందుకే ఒంటరిగా వచ్చాడు అని అపర్ణ అంటుంది. ఆ దేవుడు ఉన్నంత కాలం ఎవరు ఒంటరికాదు. మీ కొడుకు ఎక్కడికి వెళ్లాడు అని రాజ్ అడిగితే.. దగ్గరిలోనే ఉన్నాడు. కానీ, కాలం దూరం చేసింది అని అపర్ణ అంటుంది. త్వరలోనే మీ కొడుకు మీ దగ్గరికి వస్తాడు అని రాజ్ భరోసా ఇస్తే.. నువ్ అన్నట్లు త్వరగా జరిగితే బాగుండు అని అపర్ణ అంటుంది.
తర్వాత అపర్ణకు భోజనం వడ్డిస్తాడు రాజ్. మీ కొడుకు గురించి ఆలోచిస్తూ సగం సగం తినకండి. నన్ను కూడా మీ కొడుకు అని సంతోషంగా తినండి అని రాజ్ అంటాడు. అలాగే అని అపర్ణ అంటుంది. తర్వాత కావ్య, అపర్ణ ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగానే సంతోషిస్తారు. అపర్ణ సంతోషంగా భోజనం చేస్తుంటుంది. ఇంతలో పొలమారితే.. అమ్మా అంటూ నీళ్లు అందిస్తాడు రాజ్. తలపై తడుతూ నీళ్లు ఇస్తాడు. మీ అబ్బాయి తలుచుకున్నట్లున్నాడు. ఇంకేంకాదు అని భరోసా ఇస్తాడు రాజ్.
అమ్మే గుర్తుకు వస్తుంది
రామ్ గారు మీ అమ్మ పేరు మీద అన్నదానం చేయాలన్న కోరిక తీరిందా అని కావ్య అడిగితే.. సగం తీరింది. ఇంకా ఉంది అని రాజ్ అంటాడు. మీరు ఇంకో చిన్న హెల్ప్ చేయాలి. అది కూడా మంచి పనేలెండి. అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నారుగా. ఆవిడను చూస్తుంటే చిన్నప్పుడు నాకు దూరమైన మా అమ్మే గుర్తుకువస్తుందండి. ఇప్పుడు ఆవిడ కొడుకు కూడా దూరంగా ఉంటున్నాడట. తల్లీకొడుకులు దూరం అయితే ఆ బాధ నేను అర్థం చేసుకోగలను అని రాజ్ అంటాడు.
అది కూడా ఇవాళ ఆవిడ పుట్టినరోజు అట. వాళ్ల కొడుకు ఆవిడ పేరు మీద అన్నదానం చేయించేవాడట. ఈ సంవత్సరం లేడని చాలా బాధపడుతున్నారు. అతని స్థానంలో మనం ఉండి పుట్టినరోజు సందర్భంగా ఒక కేక్ కట్ చేయిస్తే బాగుంటుందండి అని రామ్ అంటాడు. దాంతో కావ్య ఆశ్చర్యపోతుంది. ఒక తల్లి సంతోషం కోసం ఈ కొడుకు పడుతున్న తపన చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. తప్పకుండా బర్త్ డే చేద్దాం. ఎదుటివాళ్ల సంతోషం కోరుకోవడం చాలా గొప్ప విషయం రామ్ గారు అని కావ్య అంటుంది.
మీరు అన్నదానం పూర్తి చేయండి. నేను కేక్ తెప్పిస్తాను అని కావ్య వెళ్లిపోతుంది. తర్వాత బాబు మీరు పెట్టిన భోజనంతోనే మీ అమ్మగారి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. మీలాంటి కొడుకు ఉన్న ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు. అన్నదాత సుఖీభవ అని భోజనం చేసినవాళ్లు చెప్పి వెళ్లిపోతారు. దానికి రామ్ చాలా సంతోషిస్తాడు. అదే విషయం కావ్యకు చెబుతాడు. మనం ఎన్నిరకాలుగా మాట్లాడుకున్న మనకు గతంలో పరిచయం ఉందో లేదో చెప్పడం లేదు. మీరు మనసు విప్పి చెబితే తరిస్తాను కదండి అని రాజ్ అంటాడు.
అమ్మగా అనుకోవచ్చా
యాక్సిడెంట్‌కు ముందు లేని ఈ రొమాన్స్ గతం మర్చిపోయాక ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అని మనసులో అనుకుంటుంది కావ్య. మన సంగతి తర్వాత ముందు మీరు అనుకున్నది పూర్తి చేయండి. ఆవిడకు కేక్ కట్ చేయిస్తాననుకున్నారుగా. మీరు నన్ను ఐస్ చేస్తుంటే కేక్ మెల్ట్ అయిపోతుంది. ఆవిడ గారు కూడా వెళ్లిపోతారు అని కావ్య అంటుంది. దాంతో అపర్ణ దగ్గరికి వెళ్లి అమ్మ పేరు మీద అన్నదానం చేయించాను. అలాగే కేక్ కట్ చేయించాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా అమ్మగా అనుకోవచ్చా అని రాజ్ అడుగుతాడు.
అలాగే మీరు కూడా నన్ను మీ కొడుకే అనుకోండి. మీరు కాదనే నమ్మకంతో కేక్ కూడా తెప్పించాను. వచ్చి కేక్ కట్ చేస్తారా ప్లీజ్ అని రాజ్ అంటాడు. సొంత అమ్మనే అమ్మ అనుకుంటానంటున్నావా రాజ్ అని అనుకున్న అపర్ణ కేక్ కటింగ్‌కు ఒప్పుకుంటుంది. తర్వాత అపర్ణతో కేక్ కట్ చేయించి బర్త్ డే చేస్తాడు రాజ్. అది చూసి యామిని షాక్ అవుతుంది. రామ్ దగ్గరికి వెళ్లిన యామిని బావ ఇంతకీ ఈవిడ ఎవరు అని అడుగుతుంది.
షాక్ మీద షాక్
అపర్ణ భుజాలపై చేయి వేసి అమ్మా అని మరదలికి పరిచయం చేస్తాడు రామ్. దాంతో యామిని మరింత షాక్ అవుతుంది. అపర్ణ, కావ్యతో రాజ్ ఉండటం, అపర్ణను అమ్మా అని రాజ్ చెప్పడంతో యామినికి షాక్ మీద షాక్ తగులుతుంది. అపర్ణ మాత్రం మురిసిపోతుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం