Uday Raj: ఫుడ్ మానేసి నీళ్లు మాత్రమే తాగాను.. చిరంజీవి మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.. కొత్త హీరో ఉదయ్ రాజ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Uday Raj: ఫుడ్ మానేసి నీళ్లు మాత్రమే తాగాను.. చిరంజీవి మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.. కొత్త హీరో ఉదయ్ రాజ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

New Hero Uday Raj About His Diet And Chiranjeevi: ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్ ఇప్పుడు హీరోగా మారాడు. మధురం సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఉదయ్ రాజ్ ఆ మూవీ గురించి, చిరంజీవితో మాట్లాడటంపై ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

ఫుడ్ మానేసి నీళ్లు మాత్రమే తాగాను.. చిరంజీవి మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.. కొత్త హీరో ఉదయ్ రాజ్ కామెంట్స్

New Hero Uday Raj About His Diet And Chiranjeevi: ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ‘మధురం’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొత్త హీరో ఉదయ్ రాజ్‌కు వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది.

మధురం రిలీజ్ డేట్

శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై యం. బంగార్రాజు నిర్మించారు. ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్ లైన్‌తో టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన మధురం ఇవాళ శుక్రవారం (ఏప్రిల్ 18) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న మధురం సినిమా విశేషాలను న్యూ హీరో ఉదయ్ రాజ్ ఇలా ముచ్చటించారు.

చిరంజీవి గారిపై ఇష్టం ఉండేది

“చిన్నప్పట్నుంచీ చిరంజీవి గారిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ‘ఆచార్య’ షూటింగ్ టైమ్‌లో ఆయన (చిరంజీవి) మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వర్క్ చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు గారి సపోర్ట్‌తో ‘మధురం’ చిత్రంలో హీరోగా చేశా” అని ఉదయ్ రాజ్ తెలిపాడు.

3 డిఫరెంట్ వేరియేషన్స్

“దర్శకుడు రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తాను” అని ఉదయ్ రాజ్ పేర్కొన్నాడు.

చబ్బీగా కనిపిస్తా

“చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో కొంచెం చబ్బీగా కనిపిస్తా. మళ్లీ సన్నగా అవడం కోసం ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగాను. డైరెక్టర్ గారు, నేను చదువుకుంది జెడ్‌పీహెచ్ స్కూల్‌లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం” అని హీరో ఉదయ్ రాజ్ చెప్పుకొచ్చాడు.

చేతుల వదిలేసి సైకిల్ తొక్కడం

“నైంటీస్‌లో స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్ చేశారనే వాటిపై కొన్ని రీసెర్చ్‌లు చేశాం. స్కూల్‌కి సైకిల్ వేసుకెళ్లి.. అమ్మాయి ముందు బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతో పాటు విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది” అని ఉదయ్ రాజ్ అన్నాడు.

అది కుదరలేదు

“ఇందులో కథే హీరో అని భావిస్తారు. షూటింగ్ అంతా లైవ్ లొకేషన్‌లో చేశాం. హీరోయిన్‌గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలుచేశాం. కానీ, కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు” అని న్యూ యంగ్ హీరో ఉదయ్ రాజ్ వెల్లడించాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024