గురుకులాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల‌, ఏప్రిల్ 25న ప‌రీక్ష‌..హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ చేయండి ఇలా

Best Web Hosting Provider In India 2024

గురుకులాల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల‌, ఏప్రిల్ 25న ప‌రీక్ష‌..హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ చేయండి ఇలా

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

ఆంధప్రదేశ్‌ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌ టిక్కెట్లు ఆన్‌‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. గురుకుల విద్యా సంస్థల నిర్వహణలో ఉన్న పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు.

గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు హాల్ టిక్కెట్లు విడుదల
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఆంధ్రప్రదేశ్‌ గురుకులాల్లో 5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు, ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల అయ్యాయి. ఏప్రిల్ 25న ప్ర‌వేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 5 నుంచి 8వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ఉద‌యం, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ప్ర‌వేశాల‌కు మ‌ధ్యాహ్నం ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురుకుల విద్యాల‌యాల సంస్థ కార్యద‌ర్శి విఎన్ మ‌స్తాన‌య్య ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏపీఆర్ఎస్ సెట్-2025) నిర్వ‌హిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియ‌ర్ కాలేజీ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఏపీఆర్‌జేసీ సెట్-2025), డిగ్రీ ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌డీసీ సెట్‌-2025) నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప్ర‌వేశ ప‌రీక్షను రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హిస్తామ‌న్నారు.

హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే

ఐదో త‌ర‌గ‌తి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు, అలాగే ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ప్ర‌వేశ‌ప‌రీక్ష హాల్ టిక్కెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://aprs.apcfss.in/index ను సంప్ర‌దించాలి.

అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు…

రాష్ట్రంలో మొత్తం 50 ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌ ఉండ‌గా, అందులో 5 త‌ర‌గ‌తి సీట్లు 3,920 ఉన్నాయి. అందులో మైనార్టీ, జ‌న‌ర‌ల్ రెండు ర‌కాలు స్కూల్స్ ఉన్నాయి. అలాగే బాలిక‌లు, బాలురు స్కూల్స్ కూడా ఉన్నాయి.

6 త‌ర‌గ‌తి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు 45 స్కూల్స్‌లో 1,625 సీట్లు భ‌ర్తీ చేస్తారు. వాటిని ఓసీకి 156, ఎస్సీకి 199, ఎస్టీకి 92, బీసీ-ఏకి 29, బీసీ-బీకి 50, బీసీ-సీకి 12, బీసీ-డీకి 33, బీసీ-ఈకి 37, మైనార్టీకి 895, పీహెచ్‌సీకి 56, సైనికోద్యోగుల పిల్ల‌కు 17, అనాథ‌ల‌కు 49 సీట్లు కేటాయిస్తారు.

సీట్ల కేటాయింపు

41 శాతం సీట్లు ఓసీ, 7 శాతం సీట్లు బీసీ-ఏ, 10 శాతం సీట్లు బీసీ-బీ, 1 శాతం సీట్లు బీసీ-సీ, 7 శాతం సీట్లు బీసీ-డీ, 4 శాతం సీట్లు బీసీ-ఈ, 15 శాతం సీట్లు ఎస్సీ, 6 శాతం సీట్లు ఎస్టీల‌కు కేటాయిస్తారు. అలాగే పీహెచ్‌సీ విద్యార్థులకు 43 శాతం, సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 3 శాతం, అనాథ విద్యార్థుల‌కు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

మైనార్టీ పాఠ‌శాలల్లో 73 శాతం మైనార్టీల‌కు, 15 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీల‌కు సీట్లు కేటాయిస్తారు. పీహెచ్‌సీ (మైనార్టీ)ల‌కు 3 శాతం, అనాథ (మైనార్టీ)ల‌కు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

పరీక్షల షెడ్యూల్…

1. రాత ప‌రీక్షను ఏప్రిల్ 25 ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు.

2. ఫ‌లితాలు, మొద‌టి మెరిట్ జాబితా మే 14న విడుదల అవుతుంది.

3. రెండో మెరిట్ జాబితా విడుద‌ల మే 30న విడుదల చేస్తారు.

4. మూడో మెరిట్ జాబితా జూన్ 13న విడుదల అవుతుంది.

ఎంపిక ప్ర‌క్రియ ఇలా…

ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో సీట్ల‌ను రాత ప‌రీక్ష‌లో వ‌చ్చి మార్కుల మెరిట్ ఆధారంగా, రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం భ‌ర్తీ చేస్తారు. ఈ విద్యాల‌యాల్లో విద్యా బోధ‌నా అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

ప్ర‌వేశ ప‌రీక్ష‌

ప్ర‌వేశ ప‌రీక్ష 100 మార్కుల‌కు ఉంటుంది. అయితే ప‌రీక్ష‌లో అడిగే ప్ర‌శ్న‌లు వారు ప్ర‌వేశం కోసం ద‌ర‌ఖాస్తు చేసే త‌ర‌గ‌తికి ముందు త‌ర‌గ‌తికి (ఉదాహ‌ర‌ణ‌కు ఐదో త‌ర‌గ‌తిలో చేరాల‌నుకునే విద్యార్థికి నాలుగో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌లు ఉంటాయి) చెందినవి ఉంటాయి.

జూనియ‌ర్‌ కాలేజీల్లో సీట్లు

రాష్ట్రంలో మొత్తం 10 ఏపీ రెసిడెన్షియ‌ల్ జూనియ‌ర్ కాలేజీలు ఉండ‌గా, అందులో 1,425 సీట్లు ఉన్నాయి. అందులో మూడు మైనార్టీ, ఏడు జ‌న‌ర‌ల్ కాలేజీలు ఉన్నాయి.

డిగ్రీ కాలేజీల్లో సీట్లు

రాష్ట్రంలో ఒకే ఒక ఏపీ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీలు ఉండ‌గా, అందులో 637 సీట్లు ఉన్నాయి.

సీట్ల కేటాయింపు

1. జూనియ‌ర్ కాలేజీల్లో 38 శాతం సీట్లు ఓసీ, 7 శాతం సీట్లు బీసీ-ఏ, 10 శాతం సీట్లు బీసీ-బీ, 1 శాతం సీట్లు బీసీ-సీ, 7 శాతం సీట్లు బీసీ-డీ, 4 శాతం సీట్లు బీసీ-ఈ, 15 శాతం సీట్లు ఎస్సీ, 6 శాతం సీట్లు ఎస్టీల‌కు కేటాయిస్తారు. అలాగే పీహెచ్‌సీ విద్యార్థులకు 3 శాతం, స్ఫోర్ట్స్ విద్యార్థుల‌కు 3 శాతం, సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 3 శాతం, అనాథ విద్యార్థుల‌కు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

మైనార్టీ కాలేజీల్లో 73 శాతం మైనార్టీల‌కు, 15 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీల‌కు సీట్లు కేటాయిస్తారు. పీహెచ్‌సీ (మైనార్టీ)ల‌కు 3 శాతం, అనాథ (మైనార్టీ)ల‌కు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

2. డిగ్రీ కాలేజీల్లో 35 శాతం సీట్లు ఓసీ, 7 శాతం సీట్లు బీసీ-ఏ, 10 శాతం సీట్లు బీసీ-బీ, 1 శాతం సీట్లు బీసీ-సీ, 7 శాతం సీట్లు బీసీ-డీ, 4 శాతం సీట్లు బీసీ-ఈ, 15 శాతం సీట్లు ఎస్సీ, 6 శాతం సీట్లు ఎస్టీల‌కు కేటాయిస్తారు. అలాగే పీహెచ్‌సీ విద్యార్థులకు 3 శాతం, స్ఫోర్ట్స్ విద్యార్థుల‌కు 3 శాతం, ఎన్‌సీసీ విద్యార్థుకు 3 శాతం. సైనికోద్యోగుల పిల్ల‌ల‌కు 3 శాతం, అనాథ విద్యార్థుల‌కు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ కేట‌గిరీల్లో 10 శాతం ఈడ‌బ్ల్యూఎస్‌కు కేటాయిస్తారు.

జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్

1. రాత ప‌రీక్ష ఏప్రిల్ 25 మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు.

2. ఫ‌లితాలు, మొద‌టి మెరిట్ జాబితా విడుద‌ల మే 14న విడుదల చేస్తారు.

3. మొద‌టి విడత కౌన్సింగ్ ఎంపీసీ/ఈఈటీలకు మే 20, బైపీసీ/ సీజీటీః మే 21, ఎంఈసీ/ సీఈసీలకు మే 22న నిర్వహిస్తారు.

రెండో విడత కౌన్సింగ్

ఎంపీసీ/ఈఈటీలకు జూన్ 2, బైపీసీ/ సీజీటీలకు జూన్ 3, ఎంఈసీ/ సీఈసీలకు జూన్ 4న నిర్వహిస్తారు.

డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్

1. రాత ప‌రీక్ష ఏప్రిల్ 25 మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు.

2. ఫ‌లితాలు, మొద‌టి మెరిట్ జాబితా విడుద‌ల మే 14న విడదుల చేస్తారు.

3. మొద‌టి విడత కౌన్సింగ్ః మే 23న ఉంటుంది.

4. రెండో విడత కౌన్సింగ్ః జూన్ 6న నిర్వహిస్తారు.

ఎంపిక ప్ర‌క్రియ

ఏపీ రెసిడెన్షియ‌ల్ జూనియ‌ర్‌, డిగ్రీ కాలేజీల్లో సీట్ల‌ను రాత ప‌రీక్ష‌లో వ‌చ్చి మార్కుల మెరిట్ ఆధారంగా, రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం భ‌ర్తీ చేస్తారు. ఈ విద్యాల‌యాల్లో విద్యా బోధ‌నా అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsEntrance TestsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024