





Best Web Hosting Provider In India 2024

Medical Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన మెడికల్ థ్రిల్లర్ మూవీ -మూడు కథలతో -ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు
OTT: తమిళ మెడికల్ థ్రిల్లర్ మూవీ ట్రామా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి టెంట్ కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో వివేక్ ప్రసన్న, అనంత్ నాగ్, చాందిని తమిళరాసన్, పూర్ణిమరవి కీలక పాత్రలు పోషించారు.
తమిళ మెడికల్ థ్రిల్లర్ మూవీ ట్రామా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి టెంట్ కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్రామా మూవీలో వివేక్ ప్రసన్న, అనంత్ నాగ్, చాందిని తమిళరాసన్, పూర్ణిమరవి కీలక పాత్రలు పోషించారు. తంబిదొరై మరియప్పన్ ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లే…
మార్చి 21న థియేటర్లలో రిలీజైన ట్రామా మూవీ యావరేజ్‌గా నిలిచింది. అంథాలజీ ఫార్మెట్‌లో మూడు కథలతో హైపర్‌లింక్ స్క్రీన్‌ప్లే విధానంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో జరిగే మోసాలకు క్రైమ్ ఎలిమెంట్‌ను జోడించి ఈ మూవీ సాగుతుంది. ఐఎమ్‌డీబీలో ట్రామా మూవీ 7.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
మెడికల్ మాఫియా…
సుందర్, గీతాలకు పెళ్లై చాలా ఏళ్లయినా పిల్లలు పుట్టరు. సుందర్‌లోనే సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యను దాచిపెట్టి గీతాను పెళ్లిచేసుకుంటాడు. జీవా, సెల్వి లవర్స్. పనిచేసే చోట ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. చిల్లర దొంగతానలు చేసే ఇద్దరు స్నేహితులు…కార్లను దొంగతనం చేసి…వచ్చిన డబ్బులతో జీవితంలో సెటిలైపోవాలని కలలు కంటారు.
ఈ ఆరుగురు అనుకోకుండా మెడికల్ మాఫియా కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?ఓ హత్యకేసులో వారు నిందితులుగా మారడానికి కారణం ఏమిటి? ఈ కేసు ఇన్వేస్టిగేషన్‌లో పోలీసులకు ఎలాంటి నిజాలు తెలిశాయి అన్నదే ఈ మూవీ కథ. పాయింట్ డిఫరెంట్‌గా ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో ట్రామా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.
కమెడియన్‌గా…
తమిళంలో కమెడియన్‌గా యాభైకిపైగా సినిమాలు చేశాడు వివేక్ ప్రసన్న. మానగరం, విక్రమ్ వేదా, అడై, రన్ బేబీ రన్‌తో పాటు పలు కోలీవుడ్ మూవీస్‌లో తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. వదందీ, నవంబర్ స్టోరీతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించాడు.
తెలుగులో హీరోయిన్‌గా…
ట్రామా మూవీలో హీరోయిన్‌గా నటించిన చాందిని తమిళరాసన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బుజ్జి ఇలా రా, కాళీచరణ్, లవర్స్, రామ్ అసుర్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
సంబంధిత కథనం