Avunu Nijam Song Lyrics: మహేశ్ బాబు అతడు సినిమా స్టోరీ చెప్పేసే అవును నిజం సాంగ్ లిరిక్స్ ఇవే! అంత మీనింగ్ ఉందా?

Best Web Hosting Provider In India 2024

Avunu Nijam Song Lyrics: మహేశ్ బాబు అతడు సినిమా స్టోరీ చెప్పేసే అవును నిజం సాంగ్ లిరిక్స్ ఇవే! అంత మీనింగ్ ఉందా?

Sanjiv Kumar HT Telugu

Avunu Nijam Song Lyrics In Telugu From Athadu: మహేశ్ బాబు కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాల్లో అతడు కూడా ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, సీన్స్, కామెడీతోపాటు సాంగ్స్ కూడా ఎంతో హిట్ అయ్యాయి. అయితే, అతడు మూవీ మొత్తం స్టోరీని ఒక్క పాటలోనే చెప్పేశారు. ఆ అవును నిజం సాంగ్ లిరిక్స్, వాటి అర్థం ఇక్కడ చూద్దాం.

మహేశ్ బాబు అతడు సినిమా స్టోరీ చెప్పేసే అవును నిజం సాంగ్ లిరిక్స్ ఇవే! అంత మీనింగ్ ఉందా?

Avunu Nijam Song Lyrics In Telugu From Athadu: సూపర్ స్టార్ మహేశ్ బాబు-డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అతడు. 2005లో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలోని డైలాగ్స్, సీన్స్, కామెడీ తెగ అలరించాయి.

ఒక్క పాటలో అతడు స్టోరీ

అందుకే అతడు మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 8.5 రేటింగ్ వస్తే రొట్టెన్ టొమాటోస్ ఏకంగా 95 శాతం ఫ్రెష్ కంటెంట్ అని తెలిపింది. అలాంటి అతడు మూవీలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కో పాట ఆడియెన్స్‌ను తెగ అలరించింది. అయితే, అతడు మూవీ స్టోరీని ఓ పాటలోనే చెప్పేశారు మేకర్స్. ఆ పాటే అవును నిజం.. నువ్వంటే నాకిష్టం. మరి అవును నిజం సాంగ్ లిరిక్స్‌ను ఇక్కడ చూద్దాం.

అవును నిజం.. నువ్వంటే నాకిష్టం

ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం

చలి పరదా ఇక నిలవదు గా..

తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ

తెలిసిందే అడగాలా..

అడగందే అనవేలా..

చెవిలో ఇలా.. చెబితే చాలా !

అవును నిజం.. నువ్వంటే నాకిష్టం..

ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం..

కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో

విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో

నిదరోతున్నా ఎదురై కనబడతావేమో

కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో

అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో

ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో

మన సలహా మది వినదు కదా..

తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ

తెలిసే ఇలా చెలరేగాలా..

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం..

ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం..

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా

జడపూలతో చెలిమికి సమయము దొరికేనా

ఎదరేముందో తమరిని వివరములడిగానా

ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా

తప్పుకో.. కళ్లు మూసుకుని తుళ్లి రాకే నా వెంటా

వప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా

నడపదుగా నిను నది వరదా..

తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ

తెలిసే ఇలా.. ముంచెయ్యాలా !!

అవును నిజం.. నువ్వంటే నాకిష్టం

ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం

చలి పరదా ఇక నిలవదు గా..

తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ

తెలిసిందే అడగాలా..

అడగందే అనవేలా..

చెవిలో ఇలా.. చెబితే చాలా !

సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్

మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాశారు. ప్రముఖ సింగర్స్ సునీత, కేకే అవును నిజం పాటను ఆలపించారు. ఇక ఈ పాటలో అతడు స్టోరీ ఉంది.

లిరిక్స్ మీనింగ్

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా.. (మర్డర్ విషయంలో ఇరుక్కుపోయి పరిగెడుతున్నా..)

జడపూలతో చెలిమికి సమయము దొరికేనా.. (ఇలాంటి పరిస్థితుల్లో నాకు ప్రేమ కరెక్ట్ కాదు)

ఎదరేముందో తమరిని వివరములడిగానా.. (నీ జీవితంలో ఏం జరుగుతుందో అని నేను అడగట్లేదు కదా)

ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా.. (నా మనసు ఏం చెబుతుందో వినమని పరుగెడుతూ వస్తాను)

తప్పుకో.. కళ్లు మూసుకుని తుళ్లి రాకే నా వెంటా.. (నా జీవితం ఏం అవుతుందో నాకే తెలీదు. నువ్ గుడ్డిగా నా వైపు రాకు)

వప్పుకో.. నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా.. (నువ్ ఒప్పుకో చాలు నిన్ను నమ్ముకుని ఎక్కడికైనా వచ్చేస్తా)

నడపదుగా నిను నది వరదా.. తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ (నా జీవితం ఒక వరద లాంటిది.. అందులో కొట్టుకుని పోతావ్. జీవితం సాఫిగా సాగదుగా)

తెలిసే ఇలా.. ముంచెయ్యాలా.. (తెలిసి కూడా ముంచేస్తావా నన్ను)

మినిమం ఉంటది

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇది తెలిసి ఈ పాటలో ఇంత మీనింగ్ ఉందా అని నెటిజన్స్ రియాక్ట్ అయితే, పలువురు మీమ్స్ వేస్తున్నారు. “హీరో పరిస్థితిని, దాదాపుగా అతడు స్టోరీని పాటలో చెప్పడం వంటి గొప్పతనం సిరివెన్నెల సీతారామశాస్త్రికే చెందింది”, “ఆయన సాహిత్యం అంటే మినిమం ఉంటది” అని నెటిజన్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024