వేసవిలో కర్ణాటకలో చూడాల్సిన పది చల్లని ప్రాంతాలు ఇవిగో, ఇక్కడికి వెళితే స్వర్గంలా అనిపిస్తుంది

Best Web Hosting Provider In India 2024

వేసవిలో కర్ణాటకలో చూడాల్సిన పది చల్లని ప్రాంతాలు ఇవిగో, ఇక్కడికి వెళితే స్వర్గంలా అనిపిస్తుంది

Haritha Chappa HT Telugu

వేసవిలో ఎండలు మండిపోతాయి. చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంతోమంది ప్లాన్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఎక్కువ దూరాలు వెళ్లలేరు. కాబట్టి కర్ణాటకలో చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోండి.

కర్ణాటకలో చూడాల్సిన అందమైన ప్రాంతాలు (Getty Images)

సమ్మర్ వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? దూర తీర ప్రాంతాలకు వెళితే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చల్లని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వేసవిలో కర్ణాటకలో సందర్శించడానికి ఉన్న కూల్ ప్రదేశాల వివరాలు ఇక్కడ ఇచ్చాము. ఒక వారం రోజులు ట్రిప్ వేస్తే మీరు ఈ పది ప్రదేశాలను చూడవచ్చు. లేదా వీటిలో కొన్నింటిని అయినా చూసి రావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్నవి. అలాగే ఎంతో చల్లగా ఉండి వేసవి తాపాన్ని తీరుస్తాయి.

1. కూర్గ్

దీన్ని కొడగు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో స్కాట్లాండ్ గా కూర్గ్‌ను పిలుచుకుంటారు. పొగ మంచుతో కూడిన కొండలు, పచ్చదనం, కాఫీ తోటలకు కూర్గ్ ప్రసిద్ధి చెందింది. అక్కడికి వెళితే తిరిగి రావాలనిపించదు. అంత అందంగా ఉంటుంది ఈ ప్రదేశం.

2, చిక్ మగళూరు

కర్ణాటకలోని మరొక ప్రసిద్ధ హిల్ స్టేషన్ చిక్ మంగుళూరు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎత్తైన కొండలు, కాఫీ ఎస్టేట్లు పచ్చగా ఉంటాయి. చిక్ మగళూరు వెళ్తే కనీసం రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడ నివాసం ఉంటేనే ఆ ప్రాంతాన్ని ఎంజాయ్ చేయగలరు.

3. నంది హిల్స్

బెంగళూరుకు సమీపంలో ఉన్న నంది హిల్స్ స్థానికులకు ఎంతో ఇష్టమైన విహార ప్రదేశం. దీని వాతావరణం, సుందర దృశ్యాలు అందరికీ ఎంతో నచ్చుతాయి. ఇక్కడ ఉన్న టిప్సు సుల్తాన్ కోట చారిత్రాత్మక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఒక్కరోజు ఇక్కడ పర్యటిస్తే చాలు ఇది అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది.

4. సకలేష్ పూర్

పశ్చిమ కనుమలలో ఉన్న సకలేశ్ పూర్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉప్పొంగే జలపాతాలు, కొండలు విందుగా ఉంటాయి. ఇక ట్రెక్కింగ్ చేసే వారికి ఇది మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. సకలేష్ పూర్ వెళ్తే పచ్చని ప్రకృతి మీకు సాదరంగా స్వాగతం పలుకుతుంది.

5. కెమ్మనగుండి

ఇది ఒక కొండ ప్రాంతం. దీన్ని కేఆర్ హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ కనుమల్లో ఉన్న బాబా బుడంగిరి శ్రేణిలో ఉంది. కర్ణాటకకు వెళ్లేవారు ఈ ప్రాంతానికి కూడా అధికంగా వెళుతూ ఉంటారు.

6. అగుంబే

దక్షిణాది చిరపుంజిగా పిలువబడే అగుంబే పచ్చని అరణ్యాలతో నిండి ఉంటుంది. నిత్యం వర్షం పడుతూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అద్భుతమైన సూర్యాస్తమయాలు మీకు ఎంతో నచ్చుతాయి. జీవవైవిద్యం కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

7. బిఆర్ హిల్స్

వీటినే బిలిగిరి రంగా కొండలు అంటారు. తూర్పు కనుమలలో ఈ కొండలు ఉంటాయి. వన్యప్రాణులు అధికంగా ఉండే ప్రాంతం ఇది. ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతాల్లో ఇది ఒకటి.

8. మడికేరి

కూర్గ్ జిల్లాలో ఉండే మడికేరి ప్రాంతం పొగ మంచుతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఉండే పచ్చని లోయలు ఉప్పొంగే జలపాతాలు ఎవరినైనా కట్టి పడేస్తాయి. ఇది ఒక అందమైన కొండ ప్రాంతంగా చెప్పుకోవాలి.

9. కుద్రేముఖ్

జీవవైవిద్యం సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందినది కుద్రేముఖ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వరకు ఈ ప్రాంతం ఉత్తమమైనది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంతో నిండినది. ఇది చిక్ మంగళూరు జిల్లాలో ఉంది. కుద్రేముఖ్ పర్వతం కర్ణాటకలో రెండో ఎత్తయిన శిఖరం.

10, హంపి

హంపి అనేది కొండ ప్రాంతం కాదు. కానీ రాతి భూభాగాలతో నిండి ఉంటుంది. పురాతన శిథిలాడు ఆనాటి విజయనగర సామ్రాజ్యాలను గుర్తుకు తెస్తాయి. వేసవిలో అన్వేషించడానికి ఇదొక ప్రత్యేక గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రాంతం అంత చల్లగా ఉండకపోవచ్చు.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024