



Best Web Hosting Provider In India 2024
ముస్లింల నుంచి 1700 ఫిర్యాదులు వచ్చిన తర్వాతే వక్ఫ్ చట్టం 2025 : ప్రధాని మోదీ
వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ చట్టం చేసినట్టుగా చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు.
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వితంతువులు ప్రముఖ పాత్ర పోషించారని, వందలాది ఫిర్యాదుల తర్వాత వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పాత వ్యవస్థలో అణచివేతకు గురైన బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయం చెప్పారు. 2019లో మళ్లీ ప్రధాని అయ్యాక వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వివిధ ముస్లిం వర్గాల నుంచి 1700కు పైగా ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.
న్యాయం చేయడమే లక్ష్యం : మోదీ
కొత్త చట్టం వల్ల ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు మోదీ. ఇప్పటికే బాధితుల కోసం, ముఖ్యంగా పాత చట్టాల వల్ల ఎక్కువగా నష్టపోయిన వితంతువుల కోసం పోరాడుతున్నామన్నారు. వారికి న్యాయం చేయడమే మా లక్ష్యమన్నారు. దావూదీ బోహ్రా కమ్యూనిటీతో తమకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాన మంత్రి, వారి సామాజిక సేవా సంప్రదాయాన్ని, ఈ చట్టానికి వారు చేసిన కృషిని కొనియాడారు. బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ నుంచి ఈ చట్టంపై తాను జరిపిన తొలి చర్చల్లో కీలక మార్గదర్శకత్వం లభించిందని చెప్పారు.
ఆస్తులు కబ్జా చేశారు!
ఈ ప్రతినిధి బృందంలో వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖ దావూదీ బోహ్రా సభ్యులు ఉన్నారు. వక్ఫ్ అధికారులు తమ సామాజిక వర్గానికి చెందిన ఆస్తులను అన్యాయంగా కబ్జా చేశారని వివరించారు. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ముస్లిం సమాజంలోని అనేక వర్గాల నుండి సానుకూల ప్రతిస్పందనను పొందుతోందని, ఇది పారదర్శకతను పెంచుతుందని మోదీ అన్నారు. ఆస్తికి సంబంధించిన వివాదాలలో న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మోదీతో పాటు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.
చట్టంపై భిన్నాభిప్రాయాలు
మరోవైపు వక్ఫ్ సవరణ చట్టంపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ చట్టం దేశంలో విచ్ఛిన్నకరమని, దీనిని అమలు చేయరాదని పేర్కొన్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షంస్ ఈ చట్టాన్ని స్వాగతించారు, వక్ఫ్ ఆస్తులను ధనిక, ప్రభావవంతమైన ముస్లింల ఆక్రమణలను తొలగిస్తుందని అన్నారు. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link