





Best Web Hosting Provider In India 2024

Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ – కళ్యాణ్ రామ్ సినిమాలో అదొక్కటే ప్లస్ పాయింట్
కళ్యాణ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
ఔట్‌డేటెడ్…
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీమియర్స్‌కు మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది. రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ ఇదని, అవుట్‌డేటెడ్, ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
తల్లీకొడుకుల అనుబంధంతో…
తల్లీకొడుకుల అనుబంధంతో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమవుతుందని చెబుతోన్నారు. ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ మాత్రం షాకింగ్‌గా ఉందని అంటున్నారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని ట్వీట్స్ చేస్తున్నారు.
అర్జున్ పాత్రలో…
అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. పోలీస్ పాత్రలో విజయశాంతి మరోసారి అదరగొట్టిందని అంటున్నారు. కొన్ని సీన్స్‌లో వింటేజ్ విజయవశాంతి కనిపించిందని చెబుతోన్నారు.
క్లైమాక్స్ మినహా మిగిలిన సినిమా మొత్తం బోరింగ్‌గా సాగుతూ ఓపికకు పరీక్ష పెడుతోందని కామెంట్స్ చేస్తోన్నారు. రొటీన్ స్టోరీకి కొత్త సొబగులు అద్ది ప్రేక్షకులను మెప్పించాలనే దర్శకుడి ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టిందని చెబుతోన్నారు. పాటలు, బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారాయని ట్వీట్లు చేస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్స్ బాగున్నా…ఆ మ్యాజిక్‌ను డైరెక్టర్ కంటిన్యూ చేయలేకపోయాడని అంటున్నారు. ఇదే పాయింట్‌తో తెలుగులో గతంలో చాలా సినిమాలు వచ్చాయని చెబుతోన్నారు.
గూస్‌బంప్స్…
యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతోన్నారు. హీరోయిన్ సయి మంజ్రేకర్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని చెబుతోన్నారు.
మహేష్‌బాబు మూవీ తర్వాత…
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి నటించిన మూవీ ఇది. ఈ సినిమాలో సోహైల్‌ఖాన్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం