Tamanna: నేటి నుంచి తమన్నా అసలైన రచ్చ మొదలు కాబోతుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Tamanna: నేటి నుంచి తమన్నా అసలైన రచ్చ మొదలు కాబోతుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Director Sampath Nandi About Tamanna Odela 2 Success: తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 నిన్న (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై సూపర్ విజన్ అందించిన డైరెక్టర్ సంపత్ నంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నేటి నుంచి తమన్నా అసలైన రచ్చ మొదలు కాబోతుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Director Sampath Nandi About Tamanna Odela 2 Success: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటించి లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

ఓదెల 2 సక్సెస్ మీట్

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఓదెల 2 చిత్రంలో తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా నిన్న విడుదలైన ఓదెల 2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఏప్రిల్ 17న ఓదెల 2 సక్సెస్ మీట్ నిర్వహించారు.

పెట్టుకున్న నమ్మకాన్ని

సక్సెస్ ప్రెస్ మీట్‌లో మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థాంక్యూ. మేము ఆశించిన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

పోటా పోటీ పర్ఫామెన్స్

తమన్నా నాగ సాధువుగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చాలా అంచనాల ఏర్పడ్డాయి. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా ఉండబోతుందని మేము ముందే చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా, వశిష్ట సింహ మధ్య పోటాపోటీ పెర్ఫార్మన్స్ ఉంటుందని చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్ విట్నెస్ చేస్తున్నారు” అని సంపత్ నంది చెప్పారు.

సునామీ మొదలు కాబోతుంది

“ఇది ముఖ్యంగా లేడీస్‌తో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈరోజు ఒక ప్రీమియర్‌లాగా మొదలైంది. శుక్రవారం (నేటి) నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతుంది. శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది. ఈ వారాంతం మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు” అని దర్శకుడు సంపత్ నంది తెలిపారు.

మంత్రముగ్ధుల్ని చేస్తాయి

“ఈ సినిమాలో సైకిల్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్, అలాగే మరికొన్ని సీక్వెన్స్‌లు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్స్ నుంచి బయటికి రండి. ఈ సినిమాకి చాలా సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి” అని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

దీవించిన శివునికి

“ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కి థాంక్స్ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సినిమాని దీవించిన శివునికి, ప్రేక్షక దేవుళ్లకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు” అని డైరెక్టర్ సంపత్ నంది తన స్పీచ్ ముగించారు.

శివతాండవం మొదలైంది

నటుడు వశిష్ట ఎన్ సింహ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా స్పెషల్ డే. థియేటర్స్‌లో ఆడియెన్స్‌తో కూర్చుని ఈ సినిమా చూశాను. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శివతాండవం థియేటర్స్‌లో మొదలైంది. దాని విశ్వరూపం రేపట్నుంచి (ఏప్రిల్ 18) అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెలుస్తుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ” అని అన్నాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024