రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న పసుపుతోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోండిలా

Best Web Hosting Provider In India 2024

రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న పసుపుతోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోండిలా

Haritha Chappa HT Telugu

కాలుష్యం వల్ల ముఖ కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి రకరకాల కాస్మోటిక్స్ వాడుతూ ఉంటారు. ఆ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పసుపుతోనే మీరు ముఖాన్ని మెరిపించుకోవచ్చు. పసుపు పొడి ఇంట్లోనే ఉంటుంది. దీనితో వేసే ఫేప్ ప్యాకులు ఇక్కడ ఇచ్చాము.

పసుపు పొడితో అందం (Pixabay)

ఇంట్లో దొరికే పసుపుతోనే ముఖ కాంతిని పెంచుకునేందుకు రకరకాల ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కాదు. గాలి కాలుష్యం వల్ల ఎంతోమంది ముఖ కాంతిని కోల్పోతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే కాస్మోటిక్స్ వైపు మొగ్గు చూపుతారు.

ప్రతిరోజూ బ్యూటీ క్రీమ్, సీరమ్, ఫేస్ వాష్ వంటి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి డబ్బు ఖర్చు చేసే బదులు వంటగదిలో దొరికే పదార్థాలను ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్కరి వంటగదిలో దొరికే పసుపు ఒక స్వచ్ఛమైన నేచురల్ రెమెడీ. ఎలాంటి కెమికల్స్ దానిలో ఉండవు.

పసుపును వంటల్లో ప్రతిరోజూ వినియోగిస్తారు. పాలలో కూడా పసుపు మిక్స్ చేసి తాగుతారు. దీని వల్ల శరీర ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పసుపు ముఖానికి మెరుపును ఇస్తుంది. మొటిమలు, మచ్చలు, నల్ల మచ్చలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది అన్ని రకాల చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది.

చర్మానికి పసుపును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం వాపును తగ్గిస్తుంది. అందాన్ని పెంచుతుంది.

మెలనిన్ ఉత్పత్తి నియంత్రణ: మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా పసుపు హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ముడతలకు: పసుపులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో సహాయపడతాయి. ఇది చర్మం ముడతలను నివారిస్తుంది. చర్మం మెరుపును పెంచుతుంది. సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది.

మొటిమలు: పసుపులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.ఇది మొటిమల వచ్చే అవకాశాలను నివారిస్తాయి.

స్కిన్ గ్లో: చర్మంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ ఉంటే పసుపును చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతిని పెంచుతుంది.

చర్మానికి పసుపును ఉపయోగించే పద్ధతులు

పసుపు, నిమ్మరసం ప్యాక్: దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది. ఇది చర్మం మెరుపును పెంచుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం (నిమ్మకు బదులుగా టమోటాలు కూడా వాడవచ్చు) మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

పసుపు, తేనె ఫేస్ ప్యాక్: ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి.కావలసిన పదార్థాలు 1 టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పసుపు, పాలు: 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టీస్పూన్ పసుపు పొడిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా మారుస్తుంది. ముఖ కాంతిని పెంచుతుంది.

పసుపు, పెరుగు: 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 టీస్పూన్ పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మం ఆయిల్ బ్యాలెన్స్ ను క్రమబద్దం చేస్తుంది. కాంతిని పెంచుతుంది.

పసుపు, ఓట్ మీల్: 1 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఓట్ మీల్ (పాలు లేదా పెరుగులో నానబెట్టిన ఓట్స్), అవసరమైనంత నీరు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖానికి నేచురల్ గ్లో ఇస్తుంది.

పసుపు సహజంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాంతిని మెరుగుపరుస్తుంది. దీనిని సరైన మార్గంలో, మితంగా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఉపయోగించే మీకు ఏదైనా అలెర్జీ లేదా దురద వంటివి పసుపు వల్ల కలుగుతాయేమో చెక్ చేసుకోండి.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024