Brahmamudi April 19th Episode: యామినిని కాపాడిన కావ్య- అపర్ణ కాళ్లమీద పడిన రాజ్- జర్క్ ఇచ్చిన యామిని- కళావతి యుద్ధం!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 19th Episode: యామినిని కాపాడిన కావ్య- అపర్ణ కాళ్లమీద పడిన రాజ్- జర్క్ ఇచ్చిన యామిని- కళావతి యుద్ధం!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial April 19th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 19 ఎపిసోడ్‌లో అపర్ణ బర్త్ డే చేయిస్తున్న రాజ్ దగ్గరికి యామిని వస్తుంది. ఇక్కడికెలా వచ్చావ్ అని యామినిపై రాజ్ కోప్పడుతుంటే కావ్య కాపాడుతుంది. అపర్ణ కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు రాజ్. దాంతో శాడిస్ట్‌లా కావ్య, అపర్ణకు జర్క్ ఇస్తుంది యామిని.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 19వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మిమ్మల్ని నేను అమ్మగా అనుకోవచ్చా. అలాగే, మీరు కూడా నన్ను మీ కొడుకు అనుకోండి. కాదనరనే నమ్మకంతో కేక్ తెప్పించాను. కట్ చేస్తారా అని అపర్ణను రాజ్ అడుగుతాడు. సొంత అమ్మనే అమ్మ అనుకోమంటున్నావా రాజ్ అని మనసులో అనుకుంటుంది అపర్ణ.

రాజ్, కావ్య కలిసి

నా కొడుకు గుర్తొచ్చాడని చెబుతుంది అపర్ణ. ఆ కొడుకు కోసమే వచ్చి కేక్ కట్ చేయండి అని రాజ్ అపర్ణ చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. అపర్ణ ఎమోషనల్‌గా చూసుకుంటూ వెళ్తుంది. ఓ చోట అపర్ణకు కేక్‌కో బర్త్ డే సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తాడు రాజ్. మరోవైపు కారులో యామిని వస్తుంది. కేక్‌పైన హ్యాపీ బర్త్ డే అమ్మా అని రాసి ఉంటుంది. అది చూసి అపర్ణ మురిసిపోతుంది. రాజ్, కావ్య కలిసి అపర్ణ బర్త్ డే చేస్తారు.

ఇద్దరు అపర్ణకు విష్ చేస్తారు. మరోవైపు రామ్‌ను వెతుక్కుంటూ యామిని వస్తుంటుంది. అపర్ణ, కావ్యతో రామ్ ఉండటం చూసి యామిని ఉలిక్కిపడుతుంది. అపర్ణ, రాజ్ ఒకరికొకరు కేక్ తనిపించుకుంటారు. రాజ్ ఏంటీ వాళ్ల అమ్మకు కేక్ తినిపిస్తున్నాడు. అంటే రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందా. అప్పుడే అందరూ కలిసిపోయారా. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అని యామిని భయపడిపోతుంది. అలా జరగడానికి వీళ్లేదు అని వాళ్ల దగ్గరికి వెళ్తుంది యామిని.

బావ అని గట్టిగా పిలుస్తుంది. రాజ్ షాక్ అవుతాడు. నువ్వేంటీ ఇక్కడ. నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు. నేను ఇక్కడ ఉన్నట్లు నీకెల తెలిసింది. ఎందుకు వచ్చావ్ అని రాజ్ నిలదీస్తాడు. దాంతో ఆన్సర్ ఇవ్వలేక సతమతం అవుతుంది యామిని. ఇంతలో రామ్ గారు నేనే రమ్మని చెప్పాను అని కావ్య అంటుంది. మీరు చెప్పారా. తను మీకెలా తెలుసు అని రాజ్ అడుగుతాడు.

రాజ్ నుంచి కాపాడిన కావ్య

పరిచయం ఏం లేదు. ఇందాక మీరు చేయి వాష్ చేసుకునేందుకు వెళ్లినప్పుడు తను కాల్ చేసింది. నేనే లిఫ్ట్ చేసి అన్నదానం చేస్తున్నట్లు నేనే చెప్పాను. అందుకే వచ్చాను. అంతేగా యామిని గారు అని కావ్య అంటే.. అవును అని యామిని అయోమయంగా ఉంటుంది. మనం ఏదైనా మంచిపని చేస్తున్నప్పుడు మనవాళ్లు ఉంటే బాగుంటుందిగా అని యామినిని రాజ్ నుంచి కాపాడుతుంది కావ్య. ఇంతకీ బావ ఈవిడ ఎవరు అని యామిని అడుగుతుంది.

అమ్మా అని రాజ్ అంటాడు. దాంతో యామిని మరింత షాక్ అవుతుంది. ఏంటీ అని అడుగుతుంది. అదే అమ్మ లాంటి వారు అని గుడిలో జరిగింది చెబుతాడు రాజ్. కేక్ తెప్పించి సెలబ్రేట్ చేస్తున్నాను అని అంటాడు. రండి యామిని గారు కేక్ తినిపిద్దురుగాని అని కావ్య అంటే.. తప్పకుండా అని అపర్ణకు కేక్ తనిపించబోతుంది యామిని కానీ, పెట్టకుండా కిందపడేస్తుంది. అపర్ణ చీరపైన కేక్ పడుతుంది. సారీ అని చెబుతుంది.

చూసుకోవాలిగా యామిని. అమ్మా మీరు రండి క్లీన్ చేసుకుందురు అని అపర్ణను తీసుకెళ్లిపోతాడు రాజ్. నువ్ ఎంత కాదనుకున్నా తల్లీకొడుకుల బంధమే వేరు కదా యామిని గారు అని కావ్య అంటుంది. యామినికి అర్థంకాక ఆ అంటుంది. అమ్మ అనగానే ఎవరికైనా అనురాగం ఆప్యాయత గుర్తుకు వస్తాయి కదా. తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం మహా పాపం కదా అని కావ్య మాటలకు.. కరెక్ట్ కరెక్ట్ అని యామిని బిత్తరపోతుంది.

సొంత మనుషుల కోసం

అయినా మీరేంటి ఇక్కడి కూడా వచ్చేశారు. నేనే చెప్పాను అని చెప్పకపోతే ఏం జరిగి ఉండేదో మీకు కూడా తెలుసు కదా. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. మనసు వెళ్లినచోటకు మనిషి వెళ్లలేడు. అలా వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం. మూర్ఖత్వంతో వెళ్తే ప్రమాదం. అని మీకు తెలుసనుకుంటా అని కావ్య అంటుంది. తెలుసు. కానీ, కొన్నిసార్లు సొంత మనుషుల కోసం ఎంత రిస్క్ అయిన చేయడం తప్పు కాదు కదా. మా బావ కోమా నుంచి ఈ మధ్యే బయటకు వచ్చాడు. గతం గురించి బయటపెడితే బావ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. ఈమాత్రం జెనరల్ నాలెడ్జ్ ఉంటదని కావ్యకే కౌంటర్ ఇస్తుంది యామిని.

కావ్య షాక్ అవుతుంది. నువ్ ఎంత రెచ్చగొట్టిన రెచ్చిపోను. కావాలనే నువ్ నాతో డైరెక్ట్‌‌గా యుద్ధం చేయాలని చూస్తున్నావ్ అని తెలుసు. కానీ, రాజ్ విషయంలో నేను ఆవేశపడితే నష్టం నాకే అని కూడా బాగా తెలుసు అని యామిని మనసులో అనుకుంటుంది. నువ్ ఆవేశపడవని నాకూడా తెలుసు. అందుకే మా ఆయనకు గతం గుర్తొచ్చేవరకు మీలాగే నేను కూడా ఏం తెలియనట్లు నటిస్తాను అని కావ్య మనుసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్, అపర్ణ వస్తారు.

ఈలోపు బాగా మాట్లాడుకున్నట్లున్నారు అని రాజ్ అంటే.. పరిచయం చేసుకున్నాం అని కావ్య అంటుంది. అయితే, ముగ్గురం ఓసారి కలుద్దాం అని రాజ్ అంటాడు. తప్పకుండా అని కావ్య అంటుంది. రాజ్ తిరిగి వెళ్లిపోతు వెనక్కి తిరిగి అపర్ణను అమ్మా అని పిలుస్తాడు. అపర్ణ దగ్గరికి వెళ్లి.. ఈరోజు మీ పుట్టినరోజు కదా దీవించడమ్మా అని కాళ్ల మీద పడి నమస్కరిస్తాడు రాజ్. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని అపర్ణ దీవిస్తుంది.

జంటగా ఆశీర్వాదం

తల్లీకొడుకులు కలిసిపోయినట్లే పొంగిపోతున్నారు. ఒక చిన్న జర్క్ ఇస్తాను అని మనసులో అనుకున్న యామిని అపర్ణ దగ్గరికి వెళ్లి ఆంటీ త్వరలో మేము పెళ్లి చేసుకుని మేమిద్దరం ఒక్కటవ్వబోతున్నాం. పనిలో పని మా జంటను కూడా దీవించండి అని అంటుంది. రాజ్, యామిని జంటగా అపర్ణ ఆశీర్వాదం తీసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ అని అపర్ణ అంటుంది. దాంతో కావ్యవైపు శాడిజంతో చూస్తుంది యామిని. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి. కళావతి గారు మీరు కూడా అని చెబుతుంది యామిని.

ఇలా కావ్య, యామిని ఎక్కడా తగ్గకుండా పోటాపోటీ పడతారు. కట్ చేస్తే గుడిలో కావ్య, అపర్ణ మాట్లాడుకుంటారు. నా కొడుకు వచ్చాడు. వాడు పెట్టింది తిన్నాను. పుట్టినరోజు జరిపించాడు. ఇదంతా బాగానే ఉంది. ఆఖరిలో యామిని ఎవరు. తనెందుకు వచ్చింది. నువ్వేందుకు రమ్మన్నావ్ అని అపర్ణ అడుగుతుంది. దాంతో నేను రమ్మనలేదు. అలా చెప్పకుంటే యామినిపై ఆయన అరుస్తాడు. ఆవేశపడతాడు. అది ఆయనకు మంచిది కాదు అని కావ్య చెబుతుంది.

కానీ, పెళ్లి అంటుంది కదా అని అపర్ణ అంటే.. అంటుంది. జరగలేదు కదా. జరగదు కూడా అని కావ్య అంటుంది. ఇంత మొండి ధైర్యం ఏంటే నీకు అని అపర్ణ అంటుంది. నాతో దేవుడు ఉన్నాడనే ధైర్యం అని కావ్య చెబుతుంది. ఇలా ఎంతకాలం ఉంటావ్. ఎంతకాలం ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మాటలు పడుతూ ఉంటావ్ అని అపర్ణ అడుగుతుంది. వీటన్నింటికి సమాధానం దొరకాలంటే ముందు యామిని ఎవరు, ఎందుకు ఆయన్ను తీసుకెళ్లింది, పెళ్లి ఎందుకు చేయాలనుకుంటుందో తెలియాలి అని కావ్య అంటుంది.

యుద్ధమే చేస్తున్నావ్

ఇన్నిరోజులు నిన్ను అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించు అని అపర్ణ అంటుంది. అలాంటి మాటలేంటీ అని కావ్య అంటుంది. రాజ్ విషయంలో అందరితోపాటు నేను కూడా నిన్ను పిచ్చిదానిలా చూశాను. నువ్ ఎంత చెబుతున్నా వినకుండా నా కొడుకు కర్మకాండలు చేయాలనుకున్నాను. ఎంత పాపిష్టిదాన్ని అని అపర్ణ ఫీల్ అవుతుంది. దానికి నచ్చజెబుతుంది కావ్య. నువ్ నా కోడలిగా రావడం నేను ఏదో జన్మలా చేసుకున్న పుణ్యం. నాకు కూతురు ఉన్న నీలా ఉండదేమో. నీ భర్త కోసం నువ్ ఒక యుద్ధమే చేస్తున్నావ్. వాడి తల్లిగా నేను ఏం చేయలేకపోతున్నాను అని అపర్ణ అంటుంది.

అదంతా వదిలేయండి. ఇకనుంచి మీరు సంతోషంగా ఉండటం చూడాలి. త్వరలోనే ఆయన్ను మాములు మనిషిని చేసి ఇంటికి తీసుకొస్తాను. అప్పటివరకు ఓపిక పట్టండి అని కావ్య అంటుంది. మరోవైపు యామిని ఇంటికి రాజ్ వెళ్తాడు. గుడిలో అన్నదానం గురించి యామిని చెబుతుంది. ఈరోజు అమ్మ పుట్టినరోజు అందుకే జరిపించాను అని రాజ్ అంటాడు. నీకు అది ఎలా తెలిసిందని వైధేహి అడిగితే.. అమ్మనాన్నల సమాధిపై రాసి ఉంది. అక్కడే చూశాను అని రామ్ చెబుతాడు.

అక్కడ అపర్ణ గారి అని ఒకరు పరిచయం అయ్యారు. గుడిలో జరిగిన దాని గురించి చెబుతాడు రాజ్. ఆవిడ నాలో తన కొడుకుని చూసి సంతోషించారు అని రామ్ వెళ్లిపోతాడు. ఎవరీ అపర్ణ అని వైధేహి అడుగుతుంది. రాజ్ కన్నతల్లి అని యామిని చెబుతుంది. దాంతో యామిని తల్లిదండ్రులు షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024