



Best Web Hosting Provider In India 2024
టీజీ ఈఏపీసెట్ – 2025 అప్డేట్స్ – ఇవాళ అగ్రికల్చర్ స్ట్రీమ్ హాల్ టికెట్లు విడుదల, ఇదిగో లింక్
తెలంగాణ ఈఏపీసెట్ – 2025కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ (ఏప్రిల్ 19) అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. eapcet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
తెలంగాణ ఈఏపీసెట్ 2025 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ నుంచే ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లను ఇవాళ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 29,30 తేదీల్లో పరీక్షలు…
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం 80 వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా కూడా ఇవాళ(ఏప్రిల్ 19) మధ్యాహ్నం 3 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ టైమింగ్ వివరాలు చూస్తే… ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు ఇలా డాన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు టీజీ ఈఏపీసెట్ – 2025 అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ హాల్ టికెట్ 2025 ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు సంబంధిత వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఈ ఎగ్జామ్ ఆన్ లైన్ లోనే ఉంటుంది. మొత్తం 160 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 124 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం 2 లక్షల మందికిపైగా అప్లికేషన్ చేసుకున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
మరోవైపు టీజీ ఈఏపీసెట్ – 2025 కు ఫైన్ తో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకునే వీలు ఉంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈఏపీసెట్ – 2025 హాల్ టికెట్లు పొందవచ్చు…
సంబంధిత కథనం
టాపిక్