





Best Web Hosting Provider In India 2024

ఆమె అందాల తార, మిస్ ఇండియా ఫైనలిస్ట్.. అయినా దేశానికి సేవ చేయాలని మోడలింగ్ వదిలి సివిల్స్ ర్యాంకర్‌గా నిలిచింది
గ్లామర్ పరిశ్రమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందులోకి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఒక యువతి ఆ రంగాన్ని వదిలి పూర్తిగా దేశసేవకే అంకితమైంది.
ఇరవై మూడేళ్ల యువతి
అందంలో చందమామనే గుర్తుకుతెస్తుంది
ఆధునికతకు కేరాఫ్ అడ్రెస్‌లా బికినీలో ఎన్నోసార్లు ఫోజులిచ్చింది
వెలుగుజిలుగుల గ్లామర్ రంగంలో అందాల తారగా నిలిచింది
మిస్ ఢిల్లీ టైటిల్ గెలిచి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది
చివరికి ఆ గ్లామర్ జీవితాన్ని వదిలేసి ..
ప్రజలకు సేవ చేసేందుకు సివిల్ ర్యాంకర్ గా మారింది.
ఇప్పుడామె పెద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.
పేరు ఐశ్వర్య షెయరాన్.
మిస్ ఇండియా పోటీలకు వెళ్లడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎన్నో వడపోతల తర్వాత ఆ స్థాయికి చేరుకుంటారు. అలాంటి మిస్ ఇండియా ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది ఐశ్వర్య షెయరాన్. ఆమె అనుకుంటే బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా మారిపోవచ్చు. కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆమె రక్తంలో దేశానికి సేవ చేయాలని కాంక్ష ఉంది. ముఖ్యంగా సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించాలన్న లక్ష్యం పెట్టుకుంది.
అదే లక్ష్యంతో గ్లామర్ రంగాన్ని వదిలేసింది. ఎన్ని అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యింది. చివరికి తాను అనుకున్నది సాధించి పెద్ద ప్రభుత్వం ఉద్యోగం చేస్తోంది.
ఐశ్వర్య జీవితం ఒకప్పుడు వేరు. ఒకప్పుడు బికినీలలో గ్లామరస్ గా కనిపిస్తూ ఫోటోషూట్లలో పాల్గొనేది. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అయినా ఆమెకు మనసులో సివిల్స్ ర్యాంక్ సాధించాలన్న కోరిక ఉంది. ఆ కోరిక మోడలింగ్ రంగంలో నిలబడనీవలేదు.
అందాల పోటీల్లో ఎలా?
ఐశ్వర్య రాజస్టాన్ లో పుట్టింది. అక్కడ్నించి ఢిల్లీకి చేరుకుంది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ అనే టైటిల్ గెలుచుకుంది. అలాగే 2015లో మిస్ ఢిల్లీ టైటిల్ ని కూడా కైవసం చేసుకుంది. దీంతో ఆమెకి 2016లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. దేశంలో 21 మందికి మాత్రమే ఈ అవకాశం లభించింది. అందులో ఐశ్వర్య ఒకరు. ఆ ఏడాది ఫైనల్ కు చేరుకున్న అది కొద్ది మందిలో ఐశ్వర్య కూడా ఒకరు.
తండ్రే స్పూర్తి
అందాల పోటీల్లో తగిన గుర్తింపును సాధించాక తన జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంది ఐశ్వర్య. ఆమె మొదటి నుంచి చదువులో మొదటి స్థానమే. ఆమె ఎప్పుడూ స్కూల్లో టాపర్ గానే ఉండేది. ఆమె తండ్రి అజయ్. ఆయన భారత సైన్యంలో కల్నల్ హోదాలో ఉన్నారు.ఆయనే ఐశ్వర్యకు స్పూర్తి తండ్రిలాగే తాను దేశానికి సేవ చేయాలనుకుంది.
సివిల్స్ ర్యాంకు ఎంత?
2016లో ఐశ్వర్య ఫెమీనా మిస్ ఇండియా పోటీలో టాప్ ఫైనలిస్ట్ గా నిలిచిన తర్వాత తన సివిల్స్ కలను నిజం చేసుకునేందుకు సిద్ధమైంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే మొదటి ప్రయత్నంలోనే యుపిఎస్సీ పరీక్షను క్లియర్ చేసింది. 10 నెలల పాటు ఇంట్లోనే కూర్చుని చదివింది. మొదటిసారి ఆల్ ఇండియా 93వ ర్యాంకును సాధించింది. చివరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా మారింది. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడే ఐశ్వర్య కు ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ కూడా వచ్చింది. కానీ తన సివిల్స్ కలను నిజం చేసుకునేందుకు ఆమె అడ్మిషన్ తీసుకోలేదు.
సివిల్స్ ర్యాంక్ సాధించేందుకు ఆమె 24 గంటల సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొంది. 10 గంటల పాటు చదవడమే పనిగా పెట్టుకుంది. ఎనిమిది గంటల పాటు నిద్రపోయేది. మిగతా ఆరు గంటలు తనకు ఇష్టమైన పనులు, ఇతర పనులు చేసుకునేందుకు కేటాయించింది.
ఇప్పుడు ఐశ్వర్య భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా పనిచేస్తోంది. ఆమె కోరుకుంటూ ఐఏఎస్ జాబ్ వచ్చేది. కానీ ఆమె ఫారెన్ సర్వీస్ ఎంచుకుంది. ఐశ్వర్యను ఇప్పటికీ మోడలింగ్ రంగంలో ఈమె గురించి స్ఫూర్తిగా చెప్పుకుంటూనే ఉంటారు. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదం ఐశ్వర్య లాంటి వారిని చూసే పుట్టిందని చెప్పుకోవచ్చు.
సంబంధిత కథనం