




Best Web Hosting Provider In India 2024
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి.. బహిష్కరించిన వైసీపీ
విశాఖ జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. చివరి క్షణంలో కూటమికి మద్దతు ప్రకటించారు అవంతి కుమార్తె ప్రియాంక.
ముఖ్యమైన రాజకీయ ఎత్తుగడలో భాగంగా.. హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో.. కూటమి విశాఖపట్నం మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కలెక్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాన్ని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినప్పటికీ.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 ఓట్లు పోలయ్యాయి.
11 మంది కూటమి వారే..
మేయర్‌పై కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇటీవల వంశీ కృష్ణ రాజీనామా చేయడంతో.. కౌన్సిల్‌లో 97 మంది కార్పొరేటర్లు మిగిలిపోయారు. వీరిలో 16 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు. 11 మంది కూటమికి చెందినవారు ఉన్నారు.
నేతల జాగ్రత్తలు..
అయితే.. మలేషియా నుండి తిరిగి వస్తుండగా కూటమి కార్పొరేటర్ భూపతిరాజు సుజాత అదృశ్యం అయ్యారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె గైర్హాజరుకు వైఎస్ఆర్సీపీ కుట్రలే కారణమని కూటమి ఆరోపించింది. ఇదే సమయంలో మంత్రులు డోలా, అచ్చెన్నాయుడు, స్థానిక ఎంపీ మేయర్ ఎన్నికకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూటమి కార్పొరేటర్లు తమ కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. మేయర్ పీఠం టీడీపీకి దక్కే అవకాశం ఉంది.
అనేక కారణాలు..
విశాఖపట్నం మేయర్ పీఠంపై కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) ఫోకస్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరాలలో ఒకటి. ఇది ఆర్థిక, రాజకీయంగా చాలా ముఖ్యమైనది. అందుకే విశాఖపై పట్టు సాధించడం రాజకీయంగా చాలా కీలకం అని కూటమి భావించింది. విశాఖపట్నంపై పట్టు సాధించడం ద్వారా.. కూటమి ఆ ప్రాంతంలో తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
పట్టు సాధించడం ద్వారా..
కూటమి తమ అభివృద్ధి ఎజెండాను విశాఖపట్నంలో అమలు చేయాలని కోరుకుంటోంది. మేయర్ పీఠంపై పట్టు సాధించడం ద్వారా.. తమ అభివృద్ధి ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంత కూటమి నేతలు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం విధానాలను ఇక్కడి ప్రజలు వ్యతిరేకించారని.. అందుకే కూటమి మద్దతును పొందాలని ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్