110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసిన ఎన్టీఏ.. కారణం ఇదే

Best Web Hosting Provider In India 2024


110 మంది జేఈఈ అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసిన ఎన్టీఏ.. కారణం ఇదే

Anand Sai HT Telugu

జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు వెలువడ్డాయి. 24 మంది అభ్యర్థులకు 100 పర్సంటైల్ స్కోరు వచ్చింది. అయితే 110 మంది అభ్యర్థుల ఫలితాలను ఎన్టీఏ నిలిపివేసింది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను వెల్లడించింది. 100 శాతం పర్సంటైల్ 24 మందికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా టాప్ లిస్టులో ఉన్నారు. అయితే పరీక్ష ప్రక్రియలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడ్డానికి 110 మంది అభ్యర్థుల ఫలితాలను ఎన్టీఏ నిలిపివేసింది.

మరో 23 మంది

ఈ 110 మంది అభ్యర్థులతోపాటుగా సరిగాలేని ఫొటోలు, బయోమెట్రిక్ డేటాతో సహా వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసం కారణంగా మరో 23 మంది ఫలితాలను కూడా నిలిపి వేశారు. అయితే వీరి ఫలితాలు వెల్లడించడానికి గెజిటెడ్ ఆఫీసర్‌ ధృవీకరించిన గుర్తింపు రుజువును సమర్పించాలి.

కఠినంగా పరీక్షలు

దేశంలో కఠినంగా జరిగే ప్రవేశ పరీక్షల్లో జేఈఈ ఒకటి. ఎన్టీఏ చాలా పకడ్బందీగా ఈ పరీక్షను ప్లాన్ చేస్తుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్, ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణ, సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేసింది. డిజిటల్ మాల్ ప్రాక్టీస్‌ను నివారించేందుకు 5జీ జామర్‌లను పెట్టింది.

కారణాలు ఇవే

ప్రస్తుతం ఎన్టీఏ గుర్తించిన 110 కేసుల్లో ఎక్కువ సంఖ్యలో నకిలీ పత్రాలు, నకిలీ గుర్తింపులు, పరీక్షకు హాజరుకావడానికి మోసగాళ్లను ఉపయోగించడం వంటివి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు తమ ఆధారాలను తప్పుగా సూచించడానికి అడ్మిట్ కార్డులు, ఐడీ ప్రూఫ్‌లు వంటి గుర్తింపు పత్రాలను మార్చారు. మిగిలిన 23 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ సమాచారం సరిపోలడంలో విఫలం, దరఖాస్తు ఫారమ్‌తో చూసినప్పుడు సరిగాలేని ఫోటోలను గుర్తించారు.

జేఈఈ మెయిన్ పరీక్ష రెండు సెషన్లలో జరిగింది. జనవరి, ఏప్రిల్ 2025. సెషన్ 1 పరీక్ష సమయంలో 39 మంది అభ్యర్థులు అన్యాయమైన మార్గాలకు పాల్పడినట్టుగా ఎన్టీఏ తెలిపింది. సెషన్ 2లో ఈ సంఖ్య పెరిగి 110కి చేరింది. దీంతో రెండు సెషన్లలో అనుమానితుల సంఖ్య 149కి చేరింది.

ఈసారి ఫలితాలు

మెుత్తం 14.75 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్-80.383, ఓబీసీ-79.431, ఎస్సీ-61.15, ఎస్టీ-47.90 పర్సంటైల్ స్కోరును కటాఫ్‌గా నిర్ణయించారు. రెండు విడుతల్లో మెుత్తం 24 మందికి 100 పర్సంటైల్ వచ్చింది. తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ గుప్తా, అజయ్ రెడ్డి ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి గుత్తికొండ సాయి మనోజ్ఞ ఉన్నారు.

100 పర్సంటైల్ సాధించిన 24 మంది టాపర్లలో 22 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రాకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ ఈ ఘనత సాధించారు. టాపర్లలో రాజస్థాన్ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఒకరు, గుజరాత్ నుంచి ఇద్దరు ఉన్నారు.

Anand Sai

eMail

Best Web Hosting Provider In India 2024


Source link