



Best Web Hosting Provider In India 2024
న్యూ ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు – తేదీలు ప్రకటించిన టీటీడీ
న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. మే 11 నుంచి 19వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మే 10న సాయంత్రం అంకురార్పణం ఉంటుందని టీటీడీ పేర్కొంది.
న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 19వ తేదీతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది. మే 10వ తేదీన సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల ముందు మే 6వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
- 11-05-2025 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనం.
- 12-05-2025 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం.
- 13-05-2025 ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపు పందిరి వాహనం.
- 14-05-2025 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం.
- 15-05-2025 ఉదయం – మోహినీ అవతారం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – గరుడ వాహనం.
- 16-05-2025 ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజవాహనం.
- 17-05-2025 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.
- 18-05-2025 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.
- 19-05-2025 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సంబంధిత కథనం
టాపిక్