




Best Web Hosting Provider In India 2024

OTT Horror: ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన హారర్ థ్రిల్లర్- రిలీజైన ఒక్కరోజులోనే ట్రెండింగ్- 7.4 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
Khauf OTT Streaming In Telugu And Trending: ఓటీటీలోకి రిలీజ్ అయిన ఒక్కరోజులోనే టాప్ 1 ట్రెండింగ్‌లోకి వచ్చేసింది హారర్ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్. అంతేకాకుండా తెలుగులో కూడా ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 7.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన ఖౌఫ్ ఓటీటీ రిలీజ్ వివరాలపై లుక్కేద్దాం.
Khauf OTT Release In Telugu And Trending: ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఈ వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఖౌఫ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏప్రిలే 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఖౌఫ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్
రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానం సంపాదించుకుని సత్తా చాటుతోంది ఖౌఫ్. అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 18 నుంచి ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదట కేవలం హిందీ భాషలోనే ఖౌఫ్ ఓటీటీ రిలీజ్ అవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసరికి ఏకంగా ఐదు భాషల్లో ఖౌఫ్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
తొలిరోజే ఓటీటీ ట్రెండింగ్
హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తమిళ వంటి ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన తొలిరోజే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఖౌఫ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇండియాలోని టాప్ టీవీ షోలలో ఖౌప్ నెంబర్ వన్ ప్లేస్ సాధించి సత్తా చాటింది.
ఖౌఫ్ నటీనటులు
ఇక ఈ ఓటీటీ సిరీస్‌కు క్రియేటర్‌గా స్మిత సింగ్ ఉన్నారు. ఖౌఫ్ వెబ్ సిరీస్‌కు పంకజ్ కుమార్, సూర్య బాలృష్ణన్ దర్శకత్వం వహించగా మ్యాచ్‌బాక్స్ షార్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఖౌఫ్ వెబ్ సిరీస్‌లో మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. చుమ్ దరంగ్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, రియా శుక్లా, ప్రియాంక సేథియా, అభిషేక్ చౌహన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఖౌఫ్ కథ
ఇక ఖౌఫ్ కథ విషయానికొస్తే.. స్వేచ్ఛగా బతకాలని ఢిల్లీ పట్టణానికి వస్తుంది ఓ అమ్మాయి. ఢిల్లీలోని ఓ హాస్టల్‌లోకి అడుగుపెడుతుంది. కానీ, అప్పటికే అక్కడున్నవాళ్లు వెంటనే వెళ్లిపోవాలని చెబుతారు. కానీ, ఆ అమ్మాయి అది పట్టించుకోదు. అలాగే, హాస్టల్‌లో ఒక్కసారి అడుగుపెడితే ఆ అమ్మాయిలు బయటకు వెళ్లలేరు.
హాస్టల్ కథేంటీ
కట్ చేస్తే ఆ అమ్మాయి గది నుంచి ఏడుపు వినిపిస్తుంది. ఏంటా అని చూసిన ఆ అమ్మాయి భయంతో అరుస్తుంది. ఏదో శక్తి ఆ అమ్మాయిని గదిలోకి లాక్కెళ్తుంది. ఆ తర్వాత ఆ లేడీస్ హాస్టల్‌లో ఏం జరిగిందనేదే కథ. ఆ హాస్టల్ స్టోరీ ఏంటో తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సిరీస్ ఖౌఫ్ చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్