





Best Web Hosting Provider In India 2024

Mayasabha OTT: 400 నిమిషాలతో నాగ చైతన్య న్యూ ఓటీటీ వెబ్ సిరీస్.. పొలిటికల్ థ్రిల్లర్‌గా మయసభ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Mayasabha OTT Streaming With 400 Minutes: అక్కినేని నాగ చైతన్య మరో సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ చేయనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా మయసభ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను వెబ్ సిరీస్ డైరెక్టర్ దేవకట్టా సోషల్ మీడియాలో తాజాగా వెల్లడించారు. 400 నిమిషాలతో మయసభ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని దేవకట్టా చెప్పారు.
Mayasabha OTT Release With 400 Minutes: అక్కినేని నాగ చైతన్య చాలా కాలం గ్యాప్ తర్వాత తండేల్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు నాగ చైతన్య. హీరో నాగ చైతన్య నటిస్తున్న సరికొత్త వెబ్ సిరీస్ మయసభ.
నాగ చైతన్యతో ఇదివరకే
పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ మయసభ. ఈ సిరీస్‌కు ప్రముఖ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌కు ముందు నాగ చైతన్యతో దేవకట్టా ఆటోనగర్ సూర్య సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి దేవకట్టా దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు.
3 నెలల్లో ఓటీటీ స్ట్రీమింగ్
అయితే, తాజాగా మయసభ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ దేవకట్టా. “నాకు వస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానమే ఇది. మయసభ సీజన్ 1ను 400 నిమిషాలతో తెరకెక్కించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. మయసభ సీజన్ 1 ఫైనల్ మిక్సింగ్‌లో ఉంది. ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నాకు చాలా ఇష్టమైన నటుడితో దర్శకత్వం వహించడానికి స్త్కిప్ట్ కూడా రాస్తున్నాను” అని దేవకట్టా తెలిపారు.
ఆరున్నర గంటలకుపైగా
ఈ విషయాన్ని ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మయసభ వెబ్ సిరీస్ ఈ ఏడాదే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. 400 నిమిషాలు అంటే, దాదాపుగా ఆరున్నర గంటలకుపైగా మయసభ ఉండనుంది. సోనీ లివ్‌లో మయసభ ఓటీటీ రిలీజ్ కానుంది.
వెన్నెల మూవీతో
2025 చివరి మూడు నెలల్లో ఎప్పుడైనా సోనీ లివ్‌లో మయసభ సీజన్ 1 ఓటీటీ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే, డైరెక్టర్ దేవకట్టా వెన్నెల సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్థానం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దేవకట్టా నాగ చైతన్యతో ఆటో నగర్ సూర్య, సాయి ధరమ్ తేజ్‌తో రిపబ్లిక్ వంటి సినిమాలు తెరకెక్కించారు.
ధూత ఓటీటీ సిరీస్‌తో ఎంట్రీ
అయితే, ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ హిట్ సాధించలేకపోయాయి. ఇక నాగ చైతన్య తండేల్ కంటే ముందు ధూత వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్‌తో హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ధూత తెరకెక్కింది. ప్లాప్‌లో ఉన్న విక్రమ్ కె కుమార్‌కు ధూత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది.
మిస్టికల్ థ్రిల్లర్‌గా
ఇప్పుడు ఫ్లాప్‌లో ఉన్న దేవకట్టాకు కూడా మయసభ మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి. మరోవైపు నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు వర్మతో ఎన్సీ24 సినిమా చేస్తున్నాడు. ఇది మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.
సంబంధిత కథనం