ఊర్వశికి మతి భ్రమించిందా? తన పేరుతో గుడి ఉందనే వ్యాఖ్యలపై పూజారుల ఫైర్.. ఆమె టీమ్ ఏం చెప్పిందంటే?

Best Web Hosting Provider In India 2024

ఊర్వశికి మతి భ్రమించిందా? తన పేరుతో గుడి ఉందనే వ్యాఖ్యలపై పూజారుల ఫైర్.. ఆమె టీమ్ ఏం చెప్పిందంటే?

బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటేలాకు ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలేమో! ఉత్తరఖండ్ లో తన పేరుతో గుడి ఉందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమె.. మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమెకు మతి భ్రమించిందనే కామెంట్లు వస్తున్నాయి.

ఊర్వశి రౌటేలా (x/UrvashiRautela)

ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. అందచందాలతో కవ్విస్తున్న హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరో వివాదానికి కారణమైంది. కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ భామ ఇప్పుడు తన పేరుతో గుడి ఉందనే సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండియాలో తనకు గుడి కడతారేమో అని కూడా కామెంట్ చేయడం గమనార్హం.

ఊర్వశి కామెంట్లు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉత్తరాఖండ్ లో నా పేరు మీద గుడి ఉంది. బద్రినాథ్ కు వెళ్లేవాళ్లు ఎవరైనా ఆ పక్కనే ఉన్న నా గుడిని దర్శించొచ్చు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ నా ఫొటోను పూలతో పూజిస్తారు. అది తెలిసి షాకయ్యా. కానీ నిజం’’ అని ఊర్వశి పేర్కొంది.

సౌత్ లోనూ గుడి

ఉత్తరాఖండ్ లో గుడితో ఆగని ఊర్వశి సౌత్ ఇండియాలో ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడింది. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్, చిరంజీవి, బాల‌కృష్ణ‌తో ఈ ముద్దుగుమ్మ ఆడిపాడిన సంగతి తెలిసిందే.

‘‘సౌత్ లోనూ నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా పేరు మీద సౌత్ ఇండియాలో రెండో గుడి కడతారనే నమ్మకంతో ఉన్నా’’ అని ఊర్వశి చెప్పడం గమనార్హం. అంతే కాకుండా అన్ని గుళ్లలో జరిగినట్లే.. తన టెంపుల్ లోనూ భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటారని ఆమె పేర్కొనడం పిచ్చికి పరాకాష్ఠ అనే కామెంట్లు వస్తున్నాయి.

దారుణంగా ట్రోల్స్

తన పేరు మీద గుడి ఉందని ఊర్వశి చేసిన కామెంట్లపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. పిచ్చి పీక్స్ కు చేరిందని, ఆమెకు మతి భ్రమించిందని పోస్టులు పెడుతున్నారు. ఇక బద్రినాథ్ లో ఉండే స్థానిక పూజారులు కూడా ఊర్వశిపై మండిపడుతున్నారు. బామ్నికి సమీపంలో ఊర్వశి టెంపుల్ ఉందని, కానీ అది ఈ యాక్టర్ కు ఏ మాత్రం సంబంధించింది కాదని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఊర్వశిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమ్ క్లారిటీ

ఊర్వశి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రేగడంతో ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. వితండ వాదంతో కూడిన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఊర్వశి ఆ వీడియోలో తన పేరు మీద ఆలయం ఉందని చెప్పింది. అంతే కానీ అది తన గుడి అని చెప్పలేదు. ఆమె వ్యాఖ్యలనూ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడియోను మరోసారి చూడాలి. ఢిల్లీ యూనివర్సిటీలో నిజంగానే ఆమె ఫొటోకు దండలు వేసి పూజిస్తారు. మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలి’’ అని ఊర్వశి టీమ్ పేర్కొనడం గమనార్హం.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024