కరెంట్ బిల్లు కష్టాలకు చెల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.78 వేల సబ్సిడీ- పీఎం సూర్య ఘర్ పథకం పూర్తి వివరాలివే

Best Web Hosting Provider In India 2024

కరెంట్ బిల్లు కష్టాలకు చెల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.78 వేల సబ్సిడీ- పీఎం సూర్య ఘర్ పథకం పూర్తి వివరాలివే

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

సామాన్యుడిపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్ పథకం’ ద్వారా నివాస గృహాలకు సోలార్ ప్యానల్స్ అమరుస్తుంది. 40 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అందిస్తున్నారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొంది.

కరెంట్ బిల్లు కష్టాలకు చెల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.78 వేల సబ్సిడీ- పీఎం సూర్య ఘర్ పథకం పూర్తి వివరాలివే
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

సమ్మర్ వచ్చిందంటే కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. బయట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఏసీలు, కూలర్లు తప్పనిసరి అవుతున్నాయి. వీటి వినియోగంతో కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయి. వినియోగదారులపై భారంగా పడకుండా కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్ అమలు చేస్తుంది. అదే ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ఈ పథకంలో భాగంగా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరుస్తారు. దీంతో విద్యుత్ ఆదాతో పాటు వినియోగదారుడిపై భారం తగ్గుతుంది. గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫిబ్రవరి 15, 2024లో ప్రధాని మోదీ పీఎం సూర్య ఘర్ స్కీమ్ ప్రారంభించారు.

ఈ పథకం కింద ఇండ్లకు సబ్సిడీపై సౌర ఫలకలను అమరుస్తారు. సోలార్ ప్యానల్స్ ను 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.75 వేల కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అలాగే ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొంది.

నివాస గృహాలకు సబ్సిడీ

  • 1-2 కిలోవాట్‌కు : రూ. 30,000 నుంచి రూ.60,000
  • 2-3 కిలోవాట్‌కు : రూ. 60,000 నుంచి రూ.78,000
  • 3 కిలోవాట్‌ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు- రూ. 78,000

గ్రూప్ హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లకు సబ్సిడీ :

గ్రూప్ హౌసింగ్ సొసైటీ లేదా RWAలకు ఈ స్కీమ్ కింద ప్రతి kWకి రూ. 18,000 సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలు ఛార్జింగ్ లాంటి కామన్ సేవలకు ఈ సబ్సిడీ వస్తుంది. ఒక్కో ఇంటికి 3 kW చొప్పున 500 kW సామర్థ్యం వరకు ఈ సబ్సిడీ అందిస్తారు.

గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ సామర్థ్యం

సగటు నెలవారీ విద్యుత్ వినియోగం (యూనిట్లు) :

  • 0-150 : 1-2 kw
  • 150-300 : 2-3 kw
  • >300 : 3 kw కంటే ఎక్కువ

పీఎం సూర్య ఘర్ స్కీమ్ ఎలా దరఖాస్తు చేయాలి?

Step 01 : దరఖాస్తుదారుడు ముందుగా https://pmsuryaghar.gov.in/ వెబ్ సైట్ పై క్లిక్ చేయాలి.

Step 02 : హోంపేజీలో Consumer పేజీకి వెళ్లి “Apply Now” ఎంచుకోండి (లేదా) లాగిన్ డ్రాప్‌డౌన్ మెనులో “Consumer Login” ఆప్షన్ ను ఎంచుకోండి.

Step 03 : వినియోగదారుడి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. కాప్చా కోడ్ ను నమోదు చేయండి. తర్వాత “అవును, నేను PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన యొక్క అన్ని మార్గదర్శకాలను చదివాను” ఎంచుకోండి, ఆపై “Verify”పై క్లిక్ చేయండి

Step 04 : SMS ద్వారా అందుకున్న మొబైల్ OTPని నమోదు చేసి, ఆపై “లాగిన్”పై క్లిక్ చేయండి

Step 05 : లాగిన్ అయిన తర్వాత, వినియోగదారు పేరు, ఇ-మెయిల్, చిరునామా, రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్‌ను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ వినియోగదారు ప్రొఫైల్ వివరాలను నమోదు చేసి, ఆపై “సేవ్”పై క్లిక్ చేయండి.

Step 06 : ఆ తర్వాత వెండర్ ద్వారా దరఖాస్తు ఫామ్ నింపాలనుకుంటున్నారా? అని అడుగుతుంది. ‘Yes’ అని క్లిక్ చేస్తే వెండర్‌ను ఎంచుకోమని అడుగుతుంది. స్క్రీన్‌పై వెండర్ల లిస్ట్ వస్తుంది. అందులో మీ కావలసిన వెండర్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళా Shortlist Vendor అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, వెండర్ల రేటింగ్, వారు చేసిన ఇన్‌స్టాలేషన్‌ల వివరాలు కనిపిస్తాయి.

Step 07 : ‘Select Vendors’ నుంచి మీకు నచ్చిన వెండర్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరే ఫామ్ పూర్తి చేయాలని భావిస్తే లాగిన్ అయిన తర్వాత ‘My Application’ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ‘Apply for Solar Rooftop’పై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా, విద్యుత్ సరఫరా చేసే కంపెనీ పేరును నమోదు చేయండి.

Step 08 : ఆ తర్వాత ‘Consumer Account Number’పై క్లిక్ చేసి Fetch Detailsపై క్లిక్ ‘ చేయండి. స్క్రీన్‌పై కనిపించే వివరాలు సరిగ్గా ఉంటే ‘Next’పై క్లిక్ చేయాలి.

Step 09 : ఆ తర్వాత కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ‘Gender’, గ్రామీణ ప్రాంతానికి చెందినవారా లేదా పట్టణ ప్రాంతానికి చెందినవారా? గ్రామీణ ప్రాంతం అయితే, బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్ మరియు తాలూకా, గ్రామ పంచాయతీని ఎంచుకోండి. పట్టణ ప్రాంతం అయితే మున్సిపాలిటీని ఎంచుకోవాలి.

Step 10 : CSC లేదా గ్రామ పంచాయతీని ఎంచుకుంటే VLE కోడ్ నమోదు చేయాలి. Others అని ఎంచుకుంటే రెఫరెన్స్ కోడ్ నమోదు చేయాలి.

Step 11 : అనంతరం Electricity Distribution Company Detailsపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Solar Roof Top Detailsపై క్లిక్ చేసి Categoryను ఎంచుకోవాలి. Residential లేదా RWAలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఎన్ని కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కావాలో ఆ సమాచారాన్ని దరఖాస్తులో నింపాలి.

Step 12 : మీ ప్రాంతం Longitude, Latitude వివరాలు నింపాలి. Click on Mapపై క్లిక్ చేసి ఈ వివరాలు పొందవచ్చు.

Step 13 : ఇప్పుడు Click for Solar Rooftop Calculatorపై క్లిక్ చేసి, దీని ద్వారా మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ‘Electricity Consumption’లో గతంలో వాడిన విద్యుత్ బిల్లు వివరాలు నింపాలి. అప్పుడు మీ స్క్రీన్‌పై పూర్తి వివరాలు వస్తాయి. ఒకవేళ సబ్సిడీ వద్దనుకుంటే ‘Give up Subsidy’పై క్లిక్ చేయాలి.

Step 14 : అడిగిన డాక్యుమెంట్లు అన్ని అప్లోడ్ చేసి Submit బటన్ పై క్లిక్ చేయాలి. మీ దరఖాస్తు ఫామ్ Approval అయిన తర్వాత వెండర్‌ను ఎంచుకోవాలి. సబ్సిడీ కోసం మీ బ్యాంకు ఖాతా వివరాలు పూర్తిగా నింపాలి. సోలార్ ప్లాంట్ ఇన్ స్టా్ల్ చేసిన తర్వాత వెండర్ వెరిఫికేషన్ కోసం వివరాలు పంపిస్తారు. వెండర్ ఈ వివరాలను డిస్కామ్ కు అందిస్తాడు. DISCOM సిబ్బంది మీ ఇంటికి స్థలాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత మాత్రమే సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

పీఎం సూర్య ఘర్ స్కీమ్ కోసం ఏ డాక్యుమెంట్లు కావాలి?

  • గుర్తింపు కార్డు- ఆధార్, ఓటర్ ఐడీ, ప్రభుత్వం జారీ చేసే ఇతర కార్డులు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • కరెంట్ బిల్లు
  • ఇంటి పైకప్పు కోసం యాజమాన్య పత్రం

సాధారణంగా 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దాదాపుగా రూ. 1.45 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రాష్ట్రాలను బట్టి ఈ ఖర్చు కాస్త అటు ఇటుగా ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రూ. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన నగదును బ్యాంకుల ద్వారా లోన్ పొందవచ్చు. https://pmsuryaghar.gov.in/#/finance-options ఈ లింక్ లో బ్యాంక్ లోన్ వివరాలు పొందవచ్చు.

సబ్సిడీ ఎలా పొందాలి?

  • పీఎం సూర్య ఘర్ వెబ్ సైట్ లో మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. My Applicationపై క్లిక్ చేస్తే మీ వివరాలుకనిపిస్తాయి.
  • సబ్సిడీ కోసం దరఖాస్తు చేసే ముందు మీ బ్యాంకు అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
  • అన్నీ సరిగ్గా ఉంటే Redeem Subsidy ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • వెరిఫికేషన్ తర్వాత సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap Welfare SchemesGovernment Welfare SchemesNarendra ModiNational NewsAndhra Pradesh NewsTelangana News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024