Akhanda 2 OTT: అఖండ 2 స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? పోటీలో రెండు ఓటీటీలు!

Best Web Hosting Provider In India 2024

Akhanda 2 OTT: అఖండ 2 స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? పోటీలో రెండు ఓటీటీలు!

Akhanda 2 OTT: అఖండ 2 సినిమాకు హైప్ ఓ రేంజ్‍లో ఉంది. బాలకృష్ణ హీరోగా రానున్న ఈ సీక్వెల్ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ ధర చెబుతున్నారట నిర్మాతలు. ఆ వివరాలు ఇవే.

Akhandra 2 OTT: అఖండ 2 స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ ఇన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? పోటీలో రెండు ఓటీటీలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్‍లతో జోష్ మీద ఉన్నారు. ఈ ఏడాది డాకు మహరాజ్ చిత్రంతో మరో బ్లాక్‍బస్టర్ సాధించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలయ్య. 2021లో వీరి కాంబినేషన్‍లో వచ్చిన అఖండ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. అప్పటికి బాలకృష్ణ కెరీరో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‍గా వస్తున్న అఖండ 2 చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ భారీ రేటు చెబుతున్నారని సమాచారం. ఆ వివరాలు ఇవే..

మేకర్స్ డిమాండ్ ఇదే!

అఖండ 2 చిత్రానికి మంచి హైప్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్‍ను కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు సంప్రదించాయని తెలుస్తోంది. మేజర్ ఓటీటీ సంస్థలైన నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లు చర్చలు కూడా జరిపాయట. అయితే, ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ ఏకంగా రూ.100కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ లెక్క ఆశ్చర్యపరిచిందని తెలుస్తోంది.

ఇప్పటికైతే అఖండ 2 స్ట్రీమింగ్ హక్కుల విషయం చర్చల దశలోనే ఉంది. ఆ స్థాయిలో మేకర్స్ డిమాండ్ చేస్తుండటంతో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆలోచిస్తున్నాయి. మరి మేకర్స్ ఏమైనా దిగొస్తారా… లేకపోతే హైప్ ఉండటంతో అదే రేంజ్‍కు ఏదైనా ఓటీటీ హక్కులు తీసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ చిత్రం హక్కుల కోసం నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోటీలో ఉన్నాయని టాక్.

బాలయ్య గత మూవీ డాకు మహరాజ్ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వ్యూస్ భారీగా దక్కాయి. కొన్ని రోజులు నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లోనూ టాప్‍లో నిలిచింది. ఇది కూడా అఖండ 2 స్ట్రీమింగ్ హక్కులకు మరింత డిమాండ్‍ను యాడ్ చేసింది.

జోరుగా షూటింగ్

ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీని రూ.150కోట్లకు పైగా బడ్జెట్‍తో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూజ్ చేస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా ఉన్నారు. ఈ చిత్రానికి పెట్టే బడ్జెట్‍లో అధిక శాతం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల నుంచే రాబట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని.. ఏ ఓటీటీ ఎంత ధరకు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

అఖండ 2 కూడా పవర్‌ఫుల్ యాక్షన్‍తో ఉండనుంది. బోయపాటి మార్క్ మరోసారి కనిపించడం పక్కా. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా షూటింగ్‍ను పూర్తి చేసేందుకు బోయపాటి ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో మెయిన్ విలన్‍గా నటిస్తున్నారు. హిమాయల్లోనూ ఈ మూవీ షూటింగ్ ఉండనుంది. మహా కుంభమేళాలోనూ కొన్ని విజువల్స్ చిత్రీకరించింది టీమ్.

బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహరాజ్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైంది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.150కోట్ల కలెక్షన్లు దాటి సూపర్ హిట్ సాధించింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024