




Best Web Hosting Provider In India 2024

ప్రతిరోజూ మీ బిడ్డకిచ్చే కౌగిలింత వారి భవిష్యత్తునే తీర్చిదిద్దుతుంది, సైన్స్ కూడా ఇదే చెబుతోంది
పిల్లలకు కావాల్సినది తల్లిదండ్రుల ప్రేమ. పిల్లలను ప్రేమగా, సంయమనంగా పెంచితే వారు ఎంతో అందంగా ఎదుగుతారు. ముఖ్యంగా పిల్లలను తల్లిదండ్రులు ప్రతిరోజూ కౌగిలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని సైన్స్ కూడా నిర్ధారిస్తోంది.
పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. వారు ఇచ్చే చిన్న ముద్దు పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు ప్రేమగా కౌగిలించుకుంటే చాలు పిల్లలు ప్రపంచాన్ని జయించినంతగా సంతోషిస్తారు. తల్లిదండ్రుల హగ్ పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్నో అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
తల్లిదండ్రుల కౌగిలింతలు, సాన్నిహిత్యం, ప్రేమపూర్వక కమ్యూనికేషన్ వంటివి పిల్లల వ్యక్తిత్వాన్ని, దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వారి భావోద్వేగ మేధస్సు, మానసిక శ్రేయస్సు, విద్యా విజయం, సామాజిక ప్రవర్తన వంటి వాటిపై శాశ్వత ప్రభావాలను చూపుతుందని అనేక పరిశోధనలు చూపించాయి.
పిల్లల మెదడుపై ప్రభావం
చిన్నప్పటి నుండి పిల్లలకు తల్లిదండ్రుల అనురాగం వారి జీవితంలో అనుబంధాలు ఏర్పరచడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రుల నుండి నమ్మకమైన ప్రేమ, ఓదార్పును పొందే పిల్లలు మనుషులపై నమ్మకాన్ని పెంచుకుంటారు. వారిలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. వారి భావోద్వేగాలను మరింత సమర్థవంతంగా నియంత్రిస్తారు.
తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత పిల్లల్లో ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీన్ని “లవ్ హార్మోన్” అని పిలుస్తారు. ఇది బంధాన్ని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలపై ప్రేమ చూపించకపోతే ఇది వారిలో ఆందోళన, నిరాశకు దారితీస్తుంది
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పదివేల మందకిి పైగా పిల్లలపై అధ్యయనం నిర్వహించారు. మూడేళ్ల వయసు మించిన పిల్లలపై ఈ పరిశోధనను నిర్వహించారు. టీనేజీ వయసు వరకు ఉన్న పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. తల్లిదండ్రుల ప్రేమ పొందిన పిల్లల్లో దయ, భావోద్వాగాలు, తెలివి తేటలు అధికంగా ఉన్నాయి. వారి మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
మిచిగాన్ యూనివర్సిటీలో చేసిన అధ్యయనంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను కౌగలించుకోవడం, ముద్దు పెట్టడం, ప్రేమించడం వంటివి చేయడం వల్ల వారు ఆరోగ్యంగా ఎదుగుతున్నట్టు గుర్తించారు. దశాబ్దాల ప్రపంచ పరిశోధనలు కూడా పిల్లల మానసిక ఆరోగ్యానికి తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం.
తల్లిదండ్రులు పిల్లలను తిరస్కరించడ, తిట్టడం, కొట్టడం వంటివి చూస్తే వారిలో భావోద్వేగాల్లో లోపాలు ఏర్పడతాయి. పేదరికంలో ఉన్న పిల్లలు, తలిదండ్రులు లేని పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా వస్తాయి.
కౌగిలింతతో లాభాలు
- భయంతో ఉన్న బిడ్డకు తక్షణ భావోద్వేగ నియంత్రణ కావాలంటే తల్లిదండ్రులు హగ్ చేసుకోవాలి.
2. కౌగిలంత అనేది తల్లిదండ్రుల పిల్లల బంధాన్ని బలోపేతం చేస్తుంది.
3. భద్రత, అంగీకారం, ప్రేమను మాటలు లేకుండా కమ్యూనికేట్ చేసే శక్తి కౌగిలింతకే ఉంది.
4. తల్లిదండ్రులు, పిల్లలలో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను తగ్గిస్తుంది.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం