ఓదెల 2: తమన్నా సినిమాకు ఊహించని పరిస్థితి.. వీకెండ్‍లోనూ!

Best Web Hosting Provider In India 2024

ఓదెల 2: తమన్నా సినిమాకు ఊహించని పరిస్థితి.. వీకెండ్‍లోనూ!

ఓదెల 2 చిత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేక నిరాశ పరిచింది. అయితే, ఆశలు పెట్టుకున్న వీకెండ్ కూడా ఈ చిత్రానికి షాక్‍ను గురి చేసింది. ఆ వివరాలు ఇవే..

ఓదెల 2: తమన్నా సినిమాకు ఊహించని పరిస్థితి.. వీకెండ్‍లోనూ!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 చిత్రం ఈ గురువారం ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై ముందు నుంచి ఎక్కువగా క్రేజ్ ఉంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీలో తమన్నా నటించడం, పాపులరైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్ రావటంతో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక ఓదెల 2కు ఎక్కువగా నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఈ క్రమంలో వీకెండ్‍లోనూ ఈ మూవీకి భారీ నిరాశ ఎదురైంది.

చాలా ఢీలా.. కొన్ని చోట్ల క్యాన్సిల్!

ఓదెల 2 మూవీ ఊహించని విధంగా నెగెటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో తొలి రెండు రోజులు అనుకున్న దాని కంటే బాగా కలెక్షన్లు తక్కవగా వచ్చాయి. అయితే, వీకెండ్ అయిన నేడు శనివారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పుంజుకుంటుదేమోనని మూవీ టీమ్ ఆశించింది. కానీ వీకెండ్ అయినా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ భారీగా పడిపోయింది. ఢీలాగా ఉంది. కొన్ని చోట్ల షోలు కూడా క్యాన్సిల్ కూడా అయ్యాయి. ఓదెల 2 చిత్రానికి ఇలాంటి ఫలితం మాత్రం ఊహించనిదే.

ఓదెల 2 చిత్రంలో నాగసాధు భైరవిగా తమన్నా భాటియా నటించారు. ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‍ప్లే అందించిన సంపత్ నంది.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఈ చిత్రానికి మూవీ టీమ్ జోరుగా ప్రమోషన్లను చేసింది. కానీ రిజల్ట్ మాత్రం రివర్స్ అయింది. ఈ సినిమా ఇక బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కష్టంగా కనిపిస్తోంది.

ఓదెల 2 కలెక్షన్లు ఇలా..

ఓదెల 2 సినిమా తొలి రెండు రోజుల్లో సుమారు కేవలం రూ.2కోట్ల కలెక్షన్లే దక్కించుకున్నట్టు అంచనాలు ఉన్నాయి. మూడో రోజు కూడా పెద్దగా లెక్క పెరిగేలా లేదు. పుల్ రన్‍లో ఈ చిత్రం ఎంత వరకు వసూళ్లు రాబట్టగలుగుతుందనేది చూడాలి.

ఓదెల 2 మూవీలో వశిష్ట సింహా నెగెటివ్ రోల్ చేశారు. దుష్టశక్తి నుంచి గ్రామాన్ని కాపాడేందుకు పోరాటం చేసే భైరవిగా తమన్నా యాక్టింగ్‍తో మెప్పించారు. ఈ చిత్రంలో యువ, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీరోల్స్ చేశారు. ఈ మూవీకి అజ్నిష్ లోకనాథ్ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశాయి.

ఓదెల 2 స్టోరీలైన్

ఓదెల గ్రామంలో వరుస హత్యలు జరుగుతాయి. కిరాతకుడైన తిరుపతి (వశిష్ట)ని రాధా (హెబ్బా పటేల్) చంపేస్తుంది. కొన్నేళ్లు గడిశాక శక్తివంతంగా మారిన తిరుపతి ఆత్మ గ్రామానికి వస్తుంది. కొత్తగా పెళ్లైన వధువులను తిరుపతి టార్గెట్ చేస్తాడు. ముగ్గురు మరణాల తర్వాత గ్రామస్తులు రాధ దగ్గరికి వెళతారు. ఈ అతీత శక్తి నుంచి తన సోదరి, నాగసాధువు అయిన భైరవి (తమన్నా భాటియా) పోరాడగదని రాధ చెబుతుంది. తిరుపతి ఆత్మను అంతం చేసే లక్ష్యంతో ఓదెల గ్రామంలో భైరవి అడుగుపెడుతుంది. మరి ఆత్మను బైరవి ఎదుర్కొందా? ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదురయ్యాయనేది ఓదెల 2 చిత్రంలో ఉంటాయి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024